సమ్మర్ లో కచ్చితంగా విజిట్ చేయాల్సిన పర్యాటక ప్రాంతాలు ఇవే..

బయట ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫ్యామిలీతో ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుందా..? అయితే వేసవిలో విజిట్ చేయాల్సిన పర్యాటక ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లో అలా ఆహ్లాదకరంగా విహరించాలని ఉందా..? అయితే తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో ఉన్న ఈ ప్రాంతాలను ఒక్కసారి విజిట్ చేయండి.. ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలతో కలిసి ఇక్కడ కొన్ని రోజులు టైమ్ స్పెండ్ చేస్తే మరచిపోలేని అనుభూతి కలుగుతుంది. వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. అలాగే కూర్గ్ ను కొడగు అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడి పచ్చని ప్రకృతి, కాఫీ తోటలు, చల్లని వాతావరణం పర్యటకులను కట్టిపడేస్తాయి. కూర్గ్ లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలు చూస్తే అబ్బే జలపాతం ఒకటి.. ఈ వాటర్ ఫాల్ కాఫీ తోటల మధ్య ఉంటుంది. వర్షాకాలంలో ఈ జలపాతం హొయలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అలాగే రాజాస్ సీట్ అనే ప్రాంతం కూడా చాలా ఫేమస్. ఈ ప్రాంతం మడికేరిలో ఉంది. ఇక్కడి నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడం మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. పూర్వం కర్ణాటక రాజులు ఇక్కడ కూర్చుని ప్రకృతిని ఆస్వాధించేవారని చరిత్ర చెబుతోంది. దుబారే ఎలిఫెంట్ క్యాంప్, మడికేరి కోట, తలై కావేరి ప్రాంతాలు కూడా చాలా ఫేమస్..

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ప్రముఖ హిల్ స్టేషన్లలో ఒకటి. మంచుతో కప్పబడిన పర్వతాలు, బియాస్ నది, అడ్వెంచర్ గేమ్స్ కు పెట్టింది పేరు. ఇక్కడ రోహ్ తంగ్ పాస్, అటల్ టన్నెల్, హడింబా దేవి ఆలయం, వశిష్ఠ కుండం, ఓల్డ్ మనాలి, మాల్ రోడ్ చాలా ఫేమస్.. అలాగే అడ్వెంచర్ గేమ్స్ అయిన రివర్ రాఫ్టింగ్, పారా గ్లైడింగ్, ట్రెక్కింగ్, స్కీయింగ్ మంచి అనుభూతిని కలిగిస్తాయి.

కేరళలోని మున్నార్ ప్రాంతాన్ని సౌత్ ఇండియా కాశ్మీర్ అని పిలుస్తుంటారు. పచ్చని టీ తోటలు, పొగమంచుతో నిండిన కొండలు, చల్లని వాతావరణానికి మున్నార్ చాలా ఫేమస్. ఇక్కడ టీ మ్యూజియం, ఎరవికుళం నేషనల్ పార్క్, మట్టుపెట్టి డ్యామ్, కుందల సరస్సు, ఎకో పాయింట్ తదితర టూరిస్టు ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది.

Summer Travel Alert Here Are the Best Tourist Destinations You Definitely Must Visit This Season

అరకు ప్రాంతాన్ని ఆంధ్రా ఊటీ అని పిలుస్తుంటారు. ఏపీలోని విశాఖపట్నం లోయలో ఉంది ఈ ప్రాంతం. సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఈ ప్రదేశం ఉంది. ఈ ప్రాంతం చుట్టూ దట్టమైన అడవులు, కాఫీ తోటలు, జలపాతాలతో పర్యటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఈ టూరిస్ట్ ప్రాంతంలో బొర్రా గుహలు, కాఫీ మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్, గిరిజన మ్యూజియం, గాలికొండ వ్యూ పాయింట్ చాలా ఫేమస్.. సమ్మర్ లో ఈ ప్రాంతాలను విజిట్ చేసి మంచి అనుభూతిని పొందండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+