• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వజ్రోత్సవాల వేళ.. హైదరాబాదీయులకు గుడ్‌న్యూస్: ఇవ్వాళే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హైదరాబాదీయులకు గుడ్‌న్యూస్ ఇచ్చారు. ప్రాణాంతక కరోనా వైరస్ విజ‌ృంభణ వల్ల మూడేళ్ల కిందట నిలిచిపోయిన సండే ఫన్‌డే (Sunday Funday) కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. ట్యాంక్‌బండ్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

5 నుంచి

ఈ సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వరకు ట్యాంక్‌బండ్‌పై సండే ఫన్‌డే వేడుక‌లు ఏర్పాటు కానున్నాయి. వేలాదిమంది హైదాబాదీయులు దీనికి హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తోన్న నేపథ్యంలో- దీనికి అనుగుణంగా అక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్యాంక్‌బండ్ మధ్యన ఉన్న గౌతము బుద్ధుడి విగ్రహానికి త్రివర్ణ రంగులతో కూడిన విద్యుద్దీపాలను అలంకరించారు. మహనీయుల విగ్రహాలను సుందరంగా తీర్చిదిద్దారు.

వజ్రోత్సవ ఉత్సాహం..

వజ్రోత్సవ ఉత్సాహం..

ట్యాంక్‌బండ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం మొదలుకుని ట్యాంక్‌బండ్ పొడవునా మువ్వన్నెల జెండాలను ఎగురవేశారు. హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకాన్ని ట్యాంక్‌బండ్‌పై నుంచి చూడ్డానికి వీలుగా లైటింగ్‌ను అమర్చారు. హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్‌ విన్యాసాలను నిర్వహించనున్నారు. ఎక్కువ మంది సందర్శకులు బోటింగ్‌లో విహరించడానికి వీలుగా వాటి సంఖ్యను పెంచారు. పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా ట్యాంక్‌బండ్‌ను జీహెచ్ఎంసీ అధికారులు తీర్చిదిద్దారు.

ట్రాఫిక్ ఫ్రీ..

ప్రతీ ఆదివారం ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమలులో ఉంటాయి. హైదరాబాదీయులు కాలిన‌డ‌క‌న ట్యాంక్‌బండ్‌ అంతా కలియ తిరగడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేశారు. టూ వీలర్లు, త్రీ వీలర్ల రాకపోకలపైనా నిషేధం ఉంది. ట్యాంక్‌బండ్ మొత్తాన్నీ ట్రాఫిక్ ఫ్రీగా మార్చేశారు. దీనికి అవసరమైన అడ్వైజరీని కూడా ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు.

ట్యాంక్‌బండ్‌పై..

ట్యాంక్‌బండ్‌పై..

లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనదారులు అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్ మీదుగా రాకపోకలు సాగించడానికి అనుమతి లేదు. తెలుగుతల్లి విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్ పైకి వెళ్లే వాహనాలకూ అనుమతి ఉండదు. వాటిని అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ, హిమాయత్ నగర్ మీదుగా మళ్లించారు. కర్బల మైదానం నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లడానికి అంబేద్కర్ విగ్రహం మీదుగా సెయిలింగ్ క్లబ్-కవాడిగూడ-డీబీఆర్ మిల్స్-లోయర్ ట్యాంక్‌బండ్-కట్ట మైసమ్మ-తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించడానికి అనుమతి లేదు.

Recommended Video

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో హర్ గర్ తిరంగా *National | Telugu OneIndia
ట్రాఫిక్ మళ్లింపు..

ట్రాఫిక్ మళ్లింపు..


డీబీఆర్ మిల్స్ వైపు నుంచి వచ్చే వాహనాలు గోశాల-కవాడిగూడ-జబ్బార్ కాంప్లెక్స్-బైబిల్ హౌస్ మీదుగా మళ్లించారు. ఇక్బాల్ మినార్ వైపునుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే వాహనాలను పాత సచివాలయం వద్ద దారి మళ్లించారు. తెలుగు తల్లి విగ్రహం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌కు వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ ఘాట్ రోడ్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పార్కింగ్ సౌకర్యం ఉంది. లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనదారులు లోయర్ ట్యాంక్‌బండ్ స్లిప్ రోడ్ వద్ద తమ వాహనాలను పార్క్ చేయవచ్చు.

భారీ బందోబస్తు..

భారీ బందోబస్తు..

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయవచ్చు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలకు బుద్ధభవన్ రోడ్, నెక్లెస్ రోడ్ వద్ద పార్కింగ్ సౌకర్యం ఉంది. పార్కింగ్ సౌకర్యానికి సంబంధించిన సూచికలను అమర్చారు. గంట ముందు నుంచే ట్రాఫిక్ అడ్వైజరీ అమల్లోకి వస్తుంది. రాత్రి 10 గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయని గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

English summary
The Sunday Funday program will resume today at the Tank Bund after three years break. During the program Traffic police was released the traffic advisory to the commuters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X