హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమిత్ షా వారసుడి రంగప్రవేశంతో కీలక మలుపు తిరగబోతున్న రాజకీయం??

|
Google Oneindia TeluguNews

తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీ దూకుడు రాజ‌కీయం చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ పార్టీని నిల‌వ‌రించ‌డానికి అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితితోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా శ‌త‌థా ప్ర‌య‌త్నిస్తోంది. ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న ప‌రిస్థితి నుంచి అధికారాన్ని చేజిక్కించుకునే దిశ‌గా తెలంగాణ‌లో ఆ పార్టీ ప‌య‌నం కొన‌సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర స‌మితి వైఫ‌ల్యాలు, కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీన‌త‌లు బీజేపీకి దోహ‌ద‌ప‌డుతున్నాయి.

కమ్యూనిస్టుల కోటను కూల్చివేసినట్లుగానే తెలంగాణలో కూడా..

కమ్యూనిస్టుల కోటను కూల్చివేసినట్లుగానే తెలంగాణలో కూడా..

కేంద్రం నుంచి అందుతున్న మ‌ద్ద‌తు ఇక్క‌డి పార్టీ నేత‌ల‌కు అద‌న‌పు బ‌లంగా మారింది. త్రిపుర‌లో ఎలాంటి వ్యూహాన్ని అవ‌లంబించి అక్క‌డి క‌మ్యూనిస్టుల కోట‌ను కూల్చేశారో అదే వ్యూహాన్ని ఇక్క‌డ అవ‌లంబించి రాష్ట్రంలో క‌మ‌లం జెండాను రెప‌రెప‌లాడించే దిశ‌గా అధినాయ‌క‌త్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో పార్టీ సంస్థాగ‌త వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించ‌డానికి రాజ‌స్థాన్ కు చెందిన సునీల్ బ‌న్సాల్‌కు అప్ప‌గించిన విషయం తెలిసిందే.

ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి త‌రుణ్ ఛుగ్‌కు కేవ‌లం రాజ‌కీయ వ్య‌వ‌హారాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప‌రిమితం చేశారు. దీనివెనక బీజేపీ అధిష్టానం ప్రణాళిక ఉంది.

బలోపేతం కావడం కోసమే సునీల్

బలోపేతం కావడం కోసమే సునీల్


అమిత్ షాకు రైట్‌హ్యాండ్‌గా ఉండే సునీల్ రాక‌తో తెలంగాణ బీజేపీతో నూత‌నోత్తేజం వెల్లివిరుస్తుంద‌ని భావిస్తున్నారు. వాస్త‌వానికి క్షేత్ర‌స్థాయిలో బీజేపీకి బ‌లం లేదు. టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు అదే ప్ర‌ధాన బ‌లం. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉన్న బీజేపీ మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లోపేతం కావ‌డంపై దృష్టిసారించింది.

వీటిని దృష్టిలో ఉంచుకొనే సునీల్‌కు బాధ్యతలు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. 2017లో జ‌రిగిన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న‌ విజయం సాధించడంలో సునీల్ బన్సాల్ ది కీలక పాత్ర. 2022లో యూపీలో యోగి ఆదిత్యనాథ్ తిరిగి రెండోసారి అధికారంలోకి రావడంలోను కీల‌కంగా ప‌నిచేశారు.

అభ్యర్థుల ఎంపికలో నైపుణ్యం

అభ్యర్థుల ఎంపికలో నైపుణ్యం

బూత్ స్థాయి నుంచి పార్టీని బ‌లోపేతం చేసి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌డంలో సునీల్ అత్యంత నైపుణ్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. ఆయ‌న దృష్టి మొత్తం ఈ అంశంపైనే ఉంటుంది. యోగి రెండోసారి ముఖ్యమంత్రి కావడంలో ముఖ్యమైన విషయం.. వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మార్చడం. ఈ అంశం పార్టీ విజయానికి కీలకంగా మారింది.

అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో ఒక్కోసారి సునీల్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఖరారు చేస్తారు. ఆయన అంచనాలకు అనుగుణంగా లేకపోతే వారిని తిరస్కరిస్తారు. తెలంగాణలో కూడా బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టిపెట్టిన బీజేపీ అందుకనుగుణంగానే సునీల్ కు బీజేపీ తెలంగాణ సంస్థాగత వ్యవహారాలను అప్పగించారు. తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్ క్షేత్రస్థాయిలో చేసే పనితీరుతో అధికారాన్ని చేజిక్కించుకోవడం సాధ్యపడుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.

English summary
With the arrival of Sunil, who is Amit Shah's right-hand man, it is expected that the Telangana BJP will be rejuvenated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X