హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ పై సూపర్ న్యూస్!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉరుకుల పరుగుల జీవితంలో మెట్రో రైలు చాలామందికి ప్రయాణ సదుపాయాన్ని కల్పించి ప్రగతికి బాటలు వేస్తోంది. ప్రజా రవాణాలో కీలక భూమిక పోషిస్తున్న మెట్రో రైల్ అభివృద్ధికి తాజాగా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మెట్రో రెండవ దశ పనులకు కేంద్రం ఓకే చెప్తే త్వరలోనే మొదలు కానున్నాయి.

మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్ కు మంత్రివర్గం ఆమోదం
తొలి దశలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు, రెండవ దశ నిర్మాణానికి శనివారం మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపడంతో మెట్రో రైలు రెండవ దశ విస్తరణకు రాష్ట్రం నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనికి సంబంధించిన డిపిఆర్ ను మంత్రివర్గం ఆమోదించింది.

Super news for Hyderabad people Revanth govt is ready for the second phase of metro train

ఈ ప్రాంతాల్లో మెట్రో విస్తరణ
మొత్తం 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మించాలని ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో నాగోల్ శంషాబాద్, రాయదుర్గం కోకాపేట్, ఎంజీబీఎస్ చాంద్రాయణ గుట్ట, మియాపూర్ పటాన్ చెరు, ఎల్బీనగర్ హయత్ నగర్ మొత్తం 76.4 కిలోమీటర్ల మేరకు మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు రంగం సిద్ధమవుతోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో రైలు ప్రాజెక్ట్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య విధానంలో చేపట్టే మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టు కోసం మొత్తం 24వేల 249కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన డిపిఆర్ ను కేంద్రానికి నివేదించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మొదట ఈ డి పి ఆర్ ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడంతో, కేంద్రానికి చేరనుంది. కేంద్రం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టు ప్రారంభం కానుంది.

హైదరాబాద్ లో అంతటా మెట్రో పరుగులే
క్యాబినెట్ బేటిలో మెట్రో రైలుకు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయంతో ఇక హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా మెట్రో పరుగులు పెట్టనుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. హైదరాబాద్లో రోడ్డు రవాణా వ్యవస్థలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు సాయంత్రం ఉద్యోగాల నుండి ఇళ్లకు వచ్చేవారు ట్రాఫిక్ లో ఇరుక్కుని అనుభవించే నరకం అంతా ఇంతా కాదు.

కేంద్రం ఆమోదం తో మొదలు కానున్న మెట్రో రెండో దశ
ఈ ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టడం కోసం మెట్రో రైలు రవాణా వ్యవస్థలో కీలకంగా మారింది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని మరికొన్ని ప్రాంతాలలో మెట్రో విస్తరిస్తే చాలా వరకు రోడ్ల పైన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంతేకాదు ఉద్యోగాలు చేసేవారు సునాయాసంగా ఆఫీసులకు చేరుకుని తమ విధులు నిర్వర్తించుకోగలుగుతారు. మొత్తానికి రేవంత్ సర్కార్ చూపిన చొరవతో త్వరలోనే మెట్రో రెండవ దశ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+