Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్‌‌కి బ్రాండ్ అంబాసిడర్ కిషన్ రెడ్డి: జగ్గారెడ్డి సంచలనం

కాంగ్రెస్ పార్టీకి బలాన్నిచ్చే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని సన్మానిస్తానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి. బీఆర్ఎస్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. అదే జరిగితే సన్మానిస్తామని జగ్గారెడ్డి చెప్పారు.

శుక్రవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ఐనట్టున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐదేళ్లు సీఎం రేవంత్.. కాంగ్రెస్ ప్రభుత్వం సేఫ్ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలను పడగొట్టే దాంట్లో బీజేపీ నేతలు ప్రొఫెసర్లంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా పడగొట్టే అవకాశం లేదన్నారు.

Supporting comments for congress party Jagga reddy praised kishan reddy for

బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాదని తేలిపోయిందని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. అందుకే రోజుకో భాషా.. రోజుకో వేషం మారుస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి చాలా గొప్పవారు. అటల్ బీహార్ వాజ్ పాయ్ దారిలో నడుస్తున్నట్టు కనిపించింది. మంచి పని చేస్తే.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రశంసించే గుణం వాజ్ పాయ్‌ది. నిండు పార్లమెంట్‌లో ఇందిరాగాంధీని దుర్గ మాతతో పోల్చారని చెప్పుకొచ్చారు.

25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారంటే.. ఐదు నెలల కాంగ్రెస్ పాలన బాగుందని అర్థమని జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్.. రాష్ట్రంలో మంచి పాలన ఉందని ప్రశంస తమకు మంచిదేనని వ్యాఖ్యానించారు. అంతేగాక, బీజేపీలో ఉన్న ఐదుగురిలో కూడా కొందరు బయటకు వస్తారని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.

డైరెక్ట్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇండైరెక్టుగా బీజేపీ ఎమ్మెల్యేలు వస్తున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారన్నారని జగ్గగారెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తమకు సంతోషాన్నిచ్చాయన్నారు. ఇక, వరి పంట గురించి కిషన్ రెడ్డికి అవగాహన లేదని.. తెలసుకుని మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు.. సీఎం రేవంత్ రెడ్డిపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో హత్యా రాజకీయాలు లేవని.. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ప్రోత్సహించదన్నారు. మంత్రి జూపల్లిపై అబాంఢాలు వేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+