హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటి సర్వే, కాంగ్రెస్ గెలుపు, కేసీఆర్‌కు భారీ షాక్ అంటూ: అసలు నిజం ఏమంటే?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడంతో ముందస్తు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించింది. ఎన్నికల సంఘం ప్రతినిధులు రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో వివిధ పార్టీలతో సమావేశమయ్యారు.

టీఆర్ఎస్ నుంచి టిక్కెట్లు పొందినవారు, టిక్కెట్ తమకే వస్తుందని కాంగ్రెస్, ఇతర విపక్షాల్లో గట్టిగా నమ్మకం ఉన్నవారు ప్రచార రంగంలోకి దూకారు. మిగతా వారు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? తెరాస మళ్లీ గెలుస్తుందా? కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంటుందా? టీడీపీ చక్రం తిప్పుతుందా అనే చర్చ సాగుతోంది.

పవన్ సీక్రెట్ మీటింగా? ఇదిగో ఆధారం!: 'వారి అజ్ఞానానికి చింతిస్తున్నాం'పవన్ సీక్రెట్ మీటింగా? ఇదిగో ఆధారం!: 'వారి అజ్ఞానానికి చింతిస్తున్నాం'

లగడపాటి సర్వే అంటూ ప్రచారం

లగడపాటి సర్వే అంటూ ప్రచారం

ఓ వైపు ఈ చర్చ సాగుతున్న సమయంలో లగడపాటి రాజగోపాల్ సర్వే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. లగడపాటి ఎన్నికల సర్వేలకు ప్రసిద్ధి. దీంతో ఇప్పుడు తెలంగాణలోనూ లగడపాటి సర్వే ఇలా ఉందంటూ సామాజిక వేదికలో ప్రచారం సాగుతోంది. లగడపాటి లేదా లగడపాటి సంస్థ అధికారికంగా మాత్రం ఎక్కడా ప్రకటన చేయలేదు.

కేసీఆర్‌కు భారీ షాక్ అంటూ సర్వే రిపోర్ట!

కేసీఆర్‌కు భారీ షాక్ అంటూ సర్వే రిపోర్ట!


ఈ సర్వే ప్రకారం తెరాసకు షాక్ తప్పదని పేర్కొంటున్నారు. 'లగడపాటి రాజగోపాల్ తెలంగాణ రాష్ట్ర తాజా ఎన్నికల సర్వే రిపోర్ట్' అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం తెరాసకు 39 సీట్లు మాత్రమే వస్తాయని తేలిందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి 61 సీట్లు వస్తాయని, మేజిక్ ఫిగర్ స్పష్టంగా ఉందని తేలిందని పేర్కొంటున్నారు. మజ్లిస్ పార్టీకి ఏడు, టీడీపీకి మూడు, బీజేపీకి మూడు, సీపీఐకి 2, సీపీఎంకు ఒకటి, ఇతరులకు 3 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైందని పేర్కొంటున్నారు.

సర్వే రిపోర్ట్ పైన అనుమానాలు

సర్వే రిపోర్ట్ పైన అనుమానాలు


సర్వే రిపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్నప్పటికీ.. అధికారికంగా ప్రకటన చేయలేదు. పైగా శాంపిల్స్ ఎక్కడి నుంచి తీశారు, ఎన్ని నియోజకవర్గాల్లో తీశారు, ఎంతమందిని... అనే అంశాలను పేర్కొనలేదు. అలాగే, కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఈ సీట్లు వస్తాయా, పొత్తు లేకుంటే వస్తాయా అనేది కూడా పేర్కొనలేదు. కేవలం సర్వే రిపోర్ట్ అంటూ ఓ పోస్ట్ మాత్రమే పెడుతున్నారు. దీంతో దీనిపై అనుమానాలు కలుగుతున్నాయి.

నాకేం సంబంధం లేదని లగడపాటి

నాకేం సంబంధం లేదని లగడపాటి

తన పేరిట సర్వే రిపోర్ట్ అంటూ బయటకు రావడంపై లగడపాటి రాజగోపాల్ కూడా స్పందించారని తెలుస్తోంది. దీనిపై ఆయన స్పష్టత ఇచ్చారట. తన పేరిట సర్వే అంటూ సోషల్ మీడియాలో జరిగే ప్రచారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను సర్వే చేయించి ఉంటే స్వయంగా వెల్లడిస్తానని, ఈ ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు.

English summary
It is not clear when this survey was done, what the sample was and what methodology the survey agency followed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X