మునుగోడు గెలుపు - ఓటములు వారి చేతుల్లోనే: ఎవరి వైపు..!!
మునుగోడు లో గెలుపు ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ప్రతీ ఓటు కీలకంగా మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీల పైన మాటల దాడి చేస్తున్నాయి. పోలింగ్ సమయం దగ్గరపడే కొద్దీ మైండ్ గేమ్ తీవ్రత పెంచాయి. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీలు ఓటర్ల పల్స్ తెలుసుకొనేందుకు సర్వే సంస్థలను రంగంలోకి దించాయి. అందులో ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతీ పార్టీ తమకు సంబంధించిన ఓటు బ్యాంకు పైన అంచనాలు స్పష్టంగా ఉన్నాయి.
ప్రత్యర్ధి పార్టీల ఓట్ల పైన క్లారిటీ వస్తుండటంతో వారిని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, ఇప్పుడు ఆసక్తి కరంగా సర్వే సంస్థలు పార్టీలకు ఆసక్తి కర సమాచారం చేరవేశాయి. అందులో తటస్థ ఓటర్ల గురించి ఇప్పుడు మనుగోడులో బరిలో నిలిచిన పార్టీలకు పజిల్ గా మారారు. ఈ ఓటర్లు చివరి నిమిషంలో ఎవరు అనుకూలంగా మారితే ఆ పార్టీ అభ్యర్ధిదే విజయమని తేల్చి చెబుతున్నాయి. ఆ మండలాల వారీగా వారికి సంబంధించిన లెక్కలను పార్టీలకు అందిస్తున్నారు. అందులో దాదాపుగా 11 వేల ఓట్లు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. అందులో ముఖ్యంగా చౌటుప్పల్ ప్రాంతంలోని 4700 ఓట్లు, చుండూరులోని 2900 ఓట్లు తటస్థులువుగా తేల్చారు. ఈ ప్రాంతాల్లో తమకు తిరుగులేదనే భావనలో ఉన్న ప్రధాన పార్టీ..ఇప్పుడు ఈ లెక్కలతో తలలు పట్టుకుంటోంది.

గతంలో దుబ్బాక.. మునుగోడు ఓట్ల లెక్కింపులో చివరి రౌండ్ వరకు ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఇప్పుడు దాదాపుగా అంతే స్థాయిలో మునుగోడు పోరు హోరా హోరీగా సాగుతోంది. ఈ సమయంలో వేలాది ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారనేది పార్టీలకు టెన్షన్ పెంచుతోంది. ఇదే సమయంలో గెలుపు పైన భారీ బెట్టింగులు మొదలయ్యాయి. ప్రధానంగా టీఆర్ఎస్..బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ఈ బెట్టింగ్ లు కొనసాగుతున్నాయి. మరో వారం రోజుల ప్రచారానికి సమయం మిగిలి ఉంది. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలు తుది విడత ప్రచారంలోకి దిగుతున్నారు. ఇటు సర్వేలు..ఇటు జంపింగ్ లు.. దగ్గరపుడుతున్న ఓటింగ్ సమయంతో ప్రధాన పార్టీల్లో ఆందోళన పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications