షిర్డీలో కట్టింది ఆలయం కాదు, శ్మశానం: స్వరూపానంద
హైదరాబాద్: షిర్డీ సాయిబాబాపై ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద తన మాటల యుద్దాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా మంగళవారంనాడు ఆయన తీవ్రవమైన వ్యాఖ్యలు చేశారు. షిర్డీలో కట్టింది సాయి ఆలయం కాదని, శ్మశానమని అన్నారు.
శ్మశానానికి హిందువులు ఎవరూ వెళ్లరని ఆయన న్నారు. షిర్డీ సంస్థాన్ ఓ శ్మశానమని ఆయన వ్యాఖ్యానించారు. సాయి పురాణం, సాయి రామాయణం ఎందుకు రాస్తారని, సాయి బైబిల్, సాయి ఖురాన్ ఎందుకు రాయరని ఆయన అడిగారు.
సాయి పురాణాల్లో సాయిబాబా ముస్లిం అని స్పష్టంగా రాసి ఉందని చెప్పారు. సాయి చమత్కారి అయితే దేశానికి స్వాతంత్ర్యం ఎందుకు తేలేదని అడిగారు. గోవధను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. అపూజ్యులను పూజించడం వల్లనే దేశంలో కరువులు, కష్టాలు వస్తున్నాయని అన్నారు.

షిర్డీ సాయిబాబా దేవుడు కాడని ఆయన గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు. చాంద్ మియాను దేవుడిగా ఎలా పూజిస్తారని ఆయన అడుగుతూ వస్తున్నారు. స్వరూపానంద తీరుపై సాయి భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.
షిర్డీ సాయిబాబాపై ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద తన మాటల యుద్దాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా మంగళవారంనాడు ఆయన తీవ్రవమైన వ్యాఖ్యలు చేశారు. షిర్డీలో కట్టింది సాయి ఆలయం కాదని, శ్మశానమని అన్నారు.












Click it and Unblock the Notifications