బండి స్థానం మార్పు, బీజేపీ జాబితా సిద్దం - లిస్టులో ఎవరెవరు..!!
తెలంగాణ బీజేపీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదలకు రంగం సిద్దం అవుతోంది. జబితా దాదాపు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించటం, కాంగ్రెస్ ప్రకటనకు సిద్దం అవుతున్న వేళ, బీజేపీ జాబితాను సిద్దం చేసింది. ఇదే సమయంలో ముఖ్య నేతలకు బీఆర్ఎస్ కీలక నేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో బరి లోకి దించాలని నిర్ణయించారు. ఈ సారి కొత్త వ్యూహంతో కమలనాధులు తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
బీజేపీ అభ్యర్ధుల ఎంపికలో కొత్త వ్యూహాలు అమలుకు సిద్దం అవుతోంది. బీఆర్ఎస్ మంత్రుల నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతలను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. దాదాపు 35 మందితో తొలి జాబితా ప్రకటనకు పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. తొలి జాబితాలో గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపైన.. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను దించాలని పార్టీ దాదాపు నిర్ణయానికి వచ్చింది. బీఆర్ఎస్ తో విభేదించి బయటకు వచ్చిన ఈటల హుజూరాబాద్ లో గెలవటంతో, గజ్వేల్ లోనూ దించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనికి ఈటల సైతం సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు.

బీఆర్‌ఎస్ మంత్రులను లక్ష్యంగా చేసుకుని.. బలమైన అభ్యర్థులను దించాలని బీజేపీ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఓడినా, తిరిగి ఎంపీలుగా వాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి కేటీఆర్ కు ప్రత్యర్ధిగా బీజేపీ నుంచి ఎంపీ బండి సంజయ్ ను పోటీకి దింపాలని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఎంపీలుగా ఉన్న నలుగురు ఈ సారి ఎమ్మెల్యేలుగా పోటీకి సిద్దం కావాలనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. సీఎం కేసీఆర్ పోటీ చేయబోయే కామారెడ్డిలో.. అర్వింద్‌ను పోటీ చేయించాలని భావిస్తోంది. సిరిసిల్లలో కేటీఆర్‌పై బండి సంజయ్.. సిద్దిపేటలో హరీష్ రావు పై బూర నర్సయ్య గౌడ్‌ను బరిలో దింపటం ఖాయంగా కనిపిస్తోంది.
అదే విధంగా..రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారని చెబుతున్నారు, కరీంనగర్ లో గంగుల కమలాకర్ పై గుజ్జుల రామకృష్ణా రెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పై డీకే అరుణ పోటీకి దిగున్నట్లు సమాచారం. నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి పై మహేశ్వర్ రెడ్డి పోటీకి సిద్దం అవుతున్నారు. కిషన్ రెడ్డి అంబర్ పేట నుంచి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, దుబ్బాక నుంచి రఘనందన రావు పేర్లు తొలి జాబితాలో ఉండనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ జాబితా స్పష్టత వచ్చిన తరువాత తుది జాబితా విడుదలకు వీలుగా బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. పార్టీలో చేరిక లకోసం కీలక చర్చలు జరుగుతున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications