కాంగ్రెస్ పేటెంట్ ఉచిత విద్యుత్, కుట్ర రాజకీయం - భట్టి విక్రమార్క..!!
తెలంగాణలో ఉచిత విద్యుత్ పైన రాజకీయం కొనసాగుతోంది. అమెరికా పర్యటనలో రేవంత్ చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కాంగ్రెస్ ను కార్నర్ చేస్తోంది. దీనిని కాంగ్రెస్ నేతలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరిచిందని చెబుతున్నారు. తెలంగాణలో తమ పార్టీకి పెరుగుతున్న ఆదరణ తో పోటీ పడలేక..దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేసారు.
పవర్ పాలిటిక్స్
టీపీసీసీ చీఫ్ రేవంత్ చేసిన కామెంట్స్ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. రేవంత్ వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ నేతలు నిరసనలకు దిగారు. బీఆర్ఎస్ ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు ఖండించారు. అమెరికాలో రేవంత్ చేసినట్లుగా ప్రచారంలో ఉన్న వీడియో బీఆర్ఎస్ చేసిన కుట్రగా ఆరోపిస్తున్నారు. ఖమ్మం సభ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ లో జోష్ పెరిగిందని..త్వరలో ప్రియాంక సభ జరగనుండటంతో బీఆర్ఎస్ ఈ తరహా ప్రచారం ప్రారంభించిందని చెప్పుకొస్తున్నారు.

రాజకీయంగా తమను ఎదుర్కొనే అస్త్రాలు లేక..ఈ అసత్య ప్రచారం తెర మీదకు తీసుకొచ్చిందనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల కు కాంగ్రెస్ నేతలు భట్టి..కోమటిరెడ్డి...మధు యాష్కీ లాంటి వారు కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్
కాంగ్రెస్ నేతలు ఉచిత విద్యుత్ తమ పేటెంట్ అని ధీమాగా చెబుతున్నారు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రారంభించిందే కాంగ్రెస్. 2004 ఎన్నికల వేళ నాటి సీఎం చంద్రబాబు ఉచిత విద్యుత్ సాధ్యం కాదు.. అదే చేస్తే రైతులు కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా నాటి సీఎల్పీ నేత వైఎస్సార్ తన పాదయాత్రలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు.
రైతులు కాంగ్రెస్ నేతగా వైఎస్సార్ ఇచ్చిన హామీన నమ్మారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అధికారంలోకి వస్తూనే నాటి కాంగ్రెస్ సీఎంగా ఉచిత విద్యుత్ నిర్ణయం పైనే తన ప్రమాణ స్వీకార వేదిక పైనే 2004లో సంతకం చేసారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు ప్రారంభం అయింది. ఆ తరువాత రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ కు నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ పేటెంట్ గా ప్రచారం
ఖమ్మం సభలో మెజార్టీ ఓట్ బ్యాంక్ లక్ష్యంగా కాంగ్రెస్ చేయూత గ్యారంటీ స్కీం ప్రకటించిందని..దీంతో కాంగ్రెస్ వైపు ప్రజలు మళ్లుతారనే ఆందోళనతో ఈ తరహా ప్రచారం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి ఆరోపించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం తరువాత భట్టి స్పందించారు. రైతులకు ఇంకా ఎంత మేలు చేయాలో అని నిరంతరం ఆలోచించే పార్టీ అని స్పష్టం చేసారు. ఉచిత విద్యుత్ సమయాన్ని తగ్గించాలనే ఆలోచన తమకు లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఖచ్చితంగా రైతు
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications