టీ కాంగ్రెస్ మరో ప్రజా కార్యక్రమం.!ఈ నెల14నుంచి జనజాగరణ ప్రజాచైతన్య యాత్రలు.!
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో నవంబర్ 14 నుంచి 21 వరకు కాంగ్రెస్ జన జాగరణ ప్రజా చైతన్య పాదయాత్ర ఉంటుందని ఏఐసీసీ కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు జిల్లా కలెక్టర్ల పర్మిషన్లు తీసుకొని యాత్రలు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌కు లోబడి ఈ యాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు అనుమతులు ఇవ్వకుంటే గాంధీ భవన్‌లో ఫిర్యాదు చేయాలని మహేశ్వర్ రెడ్డి సూచించారు. అధికార పార్టీ చేపట్టిన ధర్నాకు కొవిడ్ నిబంధనలు ఉండవా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. 31 జిల్లాలకు 50 నుంచి 60 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇంఛార్జిలుగా, డీసీసీ ప్రెసిడెంట్లు కన్వీనర్లుగా ఉంటారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో భట్టి , రేణుకా చౌదరి, వికారాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారన్నారు.

మెదక్ జిల్లాలో దామోదర్ రాజనర్సింహ, దాసోజు, వరంగల్‌లో కొండా దంపతులు, సిరిసిల్ల జిల్లాలో మాజీ ఎంపీ రాజయ్య పాల్గొంటారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తగూడెంలో పొడెం వీరయ్య, నిర్మల్ జిల్లాలో మహేశ్వర్ రెడ్డి, జనగాం జిల్లాలో పొన్నాల, ములుగు జిల్లాలో ఎమ్మెల్యే సీతక్క పాదయాత్రలో పాల్గొంటారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు లేని అడ్డంకులు కాంగ్రెస్ ప్రజా చైతన్యయాత్రకు ఏంటని ప్రశ్నించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజా చైతన్యయాత్రకు కూడా పోలీసులు ఇబ్బందులు కలిగించొద్దని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా జిల్లాల వారీగా ప్రజా చైతన్య యాత్ర ఇంచార్జుల వివరాలు వెల్లడించారు.












Click it and Unblock the Notifications