అద్దె కష్టాలు.!సుచీరిండియాకు టీ సర్కార్ షాక్.!ఆర్టీసీ కళాభవన్‌ను లీజ్ రద్దు.!
హైదరాబాద్ : ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్ధ సుచీరిండియాకు(Suchirindia) తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ కళా భవన్ ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సీజ్ చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో గతంలో చేసుకున్న అద్దె కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది. సుచిరిండియా సంస్థ 2016లో టీఎస్‌ఆర్టీసీకి చెందిన ఆర్టీసీ కళాభవన్‌ను అద్దెకు తీసుకుంది.
ఆ భవన్‌లో కల్యాణమండపం, కళా భవన్, మరో మూడు మిని హాళ్లు లీజ్‌కు తీసుకుంటూ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం నెలకు 25.16 లక్షల రూపాయాలను టీఎస్‌ఆర్టీసీకి సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించాలి. గత కొంత కాలంగా సుచిరిండియా సంస్థ అద్దె సకాలంలో చెల్లించక పోవడంతో 6.55 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి.

పెండింగ్ బకాయిలను చెల్లించాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు పలుమార్లు సుచిరిండియాకు నోటీసులు జారీ చేశారు. సుచీరిండియా సంస్థ నుంచి గానీ, యాజమాన్యం నుంచి గానీ తగిన స్పందన రాలేదని టీఎస్ఆర్టీసి స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం నెల నెల అద్దె చెల్లించకుంటే నోటీసులు జారీ చేసి, ఆర్టీసీ కళాభవన్‌ను టీఎస్‌ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకునే వెసులుబాటు ఉంది.
నోటీసులకు సుచిరిండియా సంస్థ స్పందించకపోవడంతో.. కళాభవన్‌ను టీఎస్‌ఆర్టీసీ అధికారులు తాజాగా సీజ్ చేశారు. సుచిరిండియా కాంట్రాక్ట్ ను రద్దు చేశారు. ''సుచిరిండియా సంస్థ ఒప్పందం ప్రకారం టీఎస్‌ఆర్టీసీకి అద్దె చెల్లించడం లేదు. కాంట్రాక్టు ను రద్దు చేసి ఆర్టీసీ కళా భవన్‌ను (RTC Kala Bhavan) సీజ్ చేస్తున్నాం." అని ఆర్టీసీ కళాభవన్ ప్రధాన ద్వారం వద్ద ఒక కరపత్రాన్ని అధికారులు అతికించారు












Click it and Unblock the Notifications