కేసీఆర్ ను అలా సంబోధిస్తే.. కాంగ్రెస్ నాలుక చీరేస్తారు : తలసాని
హైదరాబాద్ : గద్వాల జనగామ జిల్లాల డిమాండుతో.. టీఆర్ఎస్ పై ధ్వజమెత్తుతోన్న కాంగ్రెస్ పై కౌంటర్ ఎటాక్ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు చేస్తోన్న తీవ్ర ఆరోపణలను తప్పుబడుతూ.. 'కేసీఆర్ ను ఏక వచనంతో సంబోధిస్తే.. ప్రజలే మీ నాలుక చీరేస్తారంటూ' కాంగ్రెస్ నేతలపై తీవ్రంగా స్పందించారు తలసాని.
జిల్లాల ఏర్పాటు విషయాన్ని ప్రస్తావిస్తూ.. అసలు తెలంగాణ జిల్లాలపై మీరెప్పుడైనా అధ్యయనం చేశారా? అని కాంగ్రెస్ నేతలను తలసాని సూటిగా ప్రశ్నించారు. 'గద్వాల జనగామలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.. అఖిలపక్ష సమావేశంలోనే ఆ మాటెందుకు చెప్పలేదు?' అని నిలదీశారు.

సిరిసిల్లను కూడా జిల్లా చేయాలన్న డిమాండ్ తెరపై ఉందని.. కానీ పాలనా సౌలభ్యం రీత్యా.. పెద్దపల్లిని జిల్లా చేస్తున్నామని తెలిపారు తలసాని. కాంగ్రెస్ నేతలు వేసే ప్రశ్నలకు సీఎం స్థాయి వ్యక్తి సమాధానం చెప్పాలా..? వాళ్లకు మండల స్థాయి నేతలు చాలు అంటూ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications