అధికారం ఉంది కాబట్టే అంతో ఇంతో చేశావు: చంద్రబాబుకు తలసాని రిప్లై*

హైదరాబాద్: విపక్షాలు ఎదురు దాడి చేస్తున్నాయని, పెద్ద యెత్తున అభివృద్ధి చేశామని చెబుతున్నారని, తాను అభివృద్ధి చేశానని చంద్రబాబు అంటున్నారని, అంతో ఇంతో చేసి ఉండవచ్చునని, అధికారంలో ఉండడం వల్లనే అది సాధ్యమైందని, కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, విశ్వనగరంగా హైదరాబాద్‌ను చేయడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

మురికి వాడలకు కరెంట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఆడిగారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాదులో ఒక్క కార్యక్రమమైన ఇచ్చిందా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం కేంద్ర ప్రభుత్వం చేస్తే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదని అన్నారు. డబ్బులు పంపిణీ చేసి ఇంత లేరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

Talasani Srinivas Yadav

కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చిన కార్యక్రమాలను చూడాలని ఆయన విపక్షాలకు సూచించారు. టిఆర్ఎస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన ఓటర్లను కోరారు. గత పరిపాలకులందరికీ ఒక్క కెటిఆరే సరిపోతారని ఆయన అన్నారు. కెటిఆర్ గ్రేటర్ హైరాబాదులో తిరుగుతుంటే వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన అన్నారు.

లాస్ట్ కిరణం

గ్రేటర్ హైదరాబాద్‌లో కచ్చితంగా వంద సీట్లు గెలుస్తామని హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ అనే లాస్ట్ కిరణం ఉండేవారని, తెలంగాణ తెచ్చుకోని ఏం చేస్తారని అన్నారని, కరెంట్ లేదు... చీకట్లు అలుముకుంటాయని అన్నారని, 24 గంటలు కరెంట్ వస్తోందని ఆయన అన్నారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యారని అంటూ తెరాస ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

రెప్పపాటు కరెంట్ కోత లేకుండా విద్యుత్తు అందిస్తున్న ఘనట సిఎం కెసిఆర్‌దేనని గ్రేటర్ హైదరాబాద్ తెరాస అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+