హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘నంది’ అవార్డు పేరు మారనుంది: ఇకపై ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్లు? (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు, సినీ ప్రముఖులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్యపన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఈ కమిటీ సూచనలు, సలహాలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

అన్ని సమస్యసలు పరిష్కరిస్తామన్నారు. శనివారం ఆయన సినీ పరిశ్రమ ప్రముఖులు, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ), పర్యాటకశాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్ని థియేటర్లలోనూ సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లోనే అమ్మేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

‘నంది' అవార్డు పేరు మారనుంది

‘నంది' అవార్డు పేరు మారనుంది

దీనిద్వారా ఎన్ని టికెట్లు అమ్ముతున్నారో తెలుస్తుందన్నారు. ఎఫ్‌డీసీ నోడల్‌ ఏజెన్సీగా ఉండి సినిమాలు తీయడానికి సింగిల్‌ విండో విధానంలో అనుమతులిప్పించాలని ఆదేశించారు. చిన్న సినిమాలు పలు సమస్యలు ఎదురుకుంటున్నాయన్నారు. చలనచిత్ర రంగం సాంకేతిక అభివృద్ధికి శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.

‘నంది' అవార్డు పేరు మారనుంది

‘నంది' అవార్డు పేరు మారనుంది

తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు నిర్వహించాలని.. తద్వారా చిత్ర నిర్మాణానికి ఖర్చు తక్కువవుతుందని, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. మూడేళ్లుగా నిలిచిపోయిన ‘నంది' అవార్డుల పేరును మార్చనున్నట్లు, త్వరలోనే కొత్తపేరును ఖరారు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.

‘నంది' అవార్డు పేరు మారనుంది

‘నంది' అవార్డు పేరు మారనుంది

సినీ కార్మికుల ఇళ్ల నిర్మాణం కోసం హైదరాబాద్‌ చిత్రపురిలో కేటాయించిన 67 ఎకరాల భూమిలో అప్రోచ్ రోడ్‌ నిర్మించాలని, రేషనకార్డులు లేని వారికి రేషన కార్డులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. కాగా, పెండింగ్‌లో ఉన్న ఎంటర్‌టైనమెంట్‌ ట్యాక్స్‌, చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలు, పైరసీ, సింగిల్‌ విండో అనుమతులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు తెలిపారు.

 ‘నంది' అవార్డు పేరు మారనుంది

‘నంది' అవార్డు పేరు మారనుంది


ఈ సమావేశంలో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, హెచ్‌ఎండీఏ కమిషనర్ టీ చిరంజీవులు, ఎఫ్‌డీసీ జేఎండీ వీ సుభాశ్, పర్యాటకశాఖ డైరెక్టర్ సునితా భగవత్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సినీ ప్రముఖులు సీ కళ్యాణ్, ఎన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Talasani Srinivas Yadav talks to media after meets with Telugu Cinema Producers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X