తెలుగు వద్దు, ఇంగ్లీషే: తెలుగు టెక్కీ మృతితో అలర్ట్ చెప్పిన టాటా

హైదరాబాద్: అమెరికాలోని బహిరంగ ప్రదేశాల్లో తెలుగు మాట్లాడవద్దని, ఆంగ్లంలోనే మాట్లాడాలని తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టాటా) ఎన్నారైలకు సూచించింది. తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యను దృష్టిలో పెట్టుకుని టాటా ఆ హెచ్చరిక చేసింది.

మాతృభాషలో మాట్లాడడాన్ని తామంతా ప్రేమిస్తామని, అయితే, తరుచుగా అదే అపార్థాలకు దారి తీసే అవకాశం ఉందని, బహిరంగ ప్రదేశాల్లో ఇంగ్లీషు మాట్లాడాలని చెప్పింది. ఈ మేరకు సంఘం ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటనను జారీ చేసింది.

'Talk in English to avoid conflict,' says Telugu US body after Kansas death

బహిరంగ ప్రదేశాల్లో ఇతరులతో వాదనలకు దిగవద్దని, అటువంటి సందర్భం వస్తే అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పింది. రద్దీ లేని ప్రాంతాల్లో తరుచుగా దాడులు జరిగే అవకాశం ఉదంని, ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దని కూడా చెప్పింది.

కాన్సాస్‌లోని బార్‌లో ఆడమ్ ప్యూరింటన్ జరిపిన కాల్పుల్లో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించగా, అతని మిత్రుడు ఆలోక్ రెడ్డి గాయపడ్డాడు. కూచిభొట్ల అంత్యక్రియలు మంగళవారంనాడు హైదరాబాదులో జరిగాయి. దాడిని అడ్డుకోబోయిన ఇయాన్ గ్రిలోట్ కూడా గాయపడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+