తెలంగాణ యాసలోనే: ఆఫీసర్లకు కెసిఆర్ ఆదేశం
హైదరాబాద్: ప్రజల సౌకర్యం కోసం తెలంగాణ యాసలో మాట్లాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. తెలుగు భాషను తెలంగాణ మాండలికంలో మాట్లాడితే తాను, మంత్రులు సంతోషిస్తామని ఆయన చెప్పారు.
కింది స్థాయి అధికారులతో, సాధారణ ప్రజలతో మాట్లాడేటప్పుడు ఆంగ్ల భాషలో మాట్లాడవద్దని ఆయన సూచించారు తెలంగాణ యాసలో అధికారులు మాట్లాడితే తాను ఎంతో సంతోషిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ యాసలో మాట్లాడితే ప్రజలు త్వరగా అర్థం చేసుకుంటారని, తెలంగాణ సమాజం హర్షిస్తుందని ఆయన అధికారులను ఉద్దేశించి అన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సమర్థవంతమైన సమాచార వినిమయం ఎంతగానో తోడ్పడుతుందని ఆయన అన్నారు. సమాచారం వినిమయం సరళంగా ఉండాలని, సమర్థంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలని అయన అన్నారు. చాలా కాలంగా తాను ఆ పని చేస్తున్నానని, అధికారులు కూడా అదే చేయాలని కోరుతున్నానని ఆయన అన్నారు
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల ఉద్యోగులు వచ్చినప్పుడు వర్క్‌షాపుల్లో, సదస్సులు లేదా సమావేశాల్లో ఉన్నతాధికారులు ఆంగ్ల భాషలో వాడకూడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications