కట్టలు తెంచుకున్న దుఃఖం.!ఆపడం ఎవ్వరి తరం కాలేదు.!సిరివెన్నెల పార్థీవ దేహాన్ని చూడగానే తల్లడిల్లిన తనికెళ్ల.!
హైదరాబాద్ : సాహిత్య యోధుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతో యావత్ చిత్ర పరిశ్రమ తీరని శోకంలో మునిగిపోయింది. సిరివెన్నెల కాలం చేసారని తెలిసిన ప్రతి గుండె రోధించకుండా ఉండలేకపోయింది. ఆయన కలం నుండి వచ్చిన పదునైన పదజాలం చాలా మంది సాహిత్య ప్రేమికులను గాయపరిచింది. ఆ గాయం మానకముందే సిరివెన్నెల అందరిని విడిచి వెళ్లిపోడంతో ప్రతి ఒక్కరికి కన్నీళ్లు కట్టలు తెంచుకుంటున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచిన సిరివెన్నెల పార్థీవదేహాన్ని చూడగానే ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి గుండె ముక్కలైపోయింది. తనికెళ్లను ఓదార్చడం ఎవ్వరితరం కాలేదు.
శోకిస్తున్న సినీ పరిశ్రమ.. సిరివెన్నెల చివరి చూపుకోసం పోటెత్తిన ప్రముఖులు
సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థీవదేహానికి నివాళులు అర్పించేందుకు రచయిత, నటుడు తనికెళ్ల భరణి బుధవారం ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చారు. సిరివెన్నెల పార్థీవదేహాన్ని చూస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. దుఃఖాన్ని ఉగ్గబట్టుకోలేకపోయారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను పట్టుకుని గుండెలు పగిలేనా రోధించారు. సిరివెన్నెల సతీమణిని తనికెళ్ల భరణి పరామర్శించారు. ఆమెను ఓదార్చే సమయంలోనూ ఆయన తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోమారు. వారి మధ్య అనుబంధం, అప్యాయతకు ఇదే నిదర్శనమని తెలుస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ సైతం ఓదార్చే ప్రయత్నం చేయగా, ఆయనను గట్టిగా పట్టుకుని మరీ కన్నీటి పర్యంతమయ్యారు తనికెళ్ల భరణి.

ఎక్కెక్కి ఏడ్చిన తనికెళ్ల భరణి.. సిరివెన్నెలతో అనుబంధం మాటల్లో చెప్పలేనిదన్న భరణి
ఈ సందర్బంగా సిరివెన్నెలకు తనతో ఉన్న అనుబంధాలను తనికెళ్ల నెమరు వేసుున్నారు. తామిద్దరూ ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చామని, స్రవంతి మూవీస్ తమను తొలిసారి ఆదరించిందని, అదే తమకు తొలి వేదిక అయ్యిందని చెప్పెకొచ్చారు. స్రవంతి మూవీస్ లో ఎన్నో సినిమాలకు కలిసి పనిచేశామని, అక్కడే ఎన్నో రోజులు నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయని, తనకంటే కేవలం రెండు నెలలే పెద్ద వాడని సీతారామశాస్త్రి గురించి తనకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు భరణి. తనను ఎంతో అప్యాయంగా పలకరించేవాడంటూ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. ఆరోగ్యం బాగా లేదని తెలిసినప్పటి నుంచి వారి కుటుంబంతో తాను టచ్‌లోనే ఉన్నానని చెప్పారు. ఒక్క వట వృక్షం కూలిపోయిందని, అంతా శూన్యమంటూ బాదా తప్త హృదయంతో వేదన పడ్డారు తనికెళ్ల.
గొప్ప సాహితీవేత్త నిష్ర్కమించాడు.. దుఃఖితులైన ప్రముఖులు..
సిరివెన్నెల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని నటుడు రావు రమేష్ అన్నారు. గొప్ప సరస్వతీ పుత్రుడిని కోల్పోయామని, అలాంటి గొప్ప వ్యక్తి గురించి వర్ణించే మేధస్సు, అంత అనుభవం, భాష తనకు తెలియవన్నారు. తన తొలి సినిమా గమ్యం చిత్రం తీసిన తరువాత చెన్నైలో ఉన్నప్పుడు క్రిష్ ఫోన్ చేసి, మీ నాన్నగారి పేరు నిలబెట్టావని ప్రశంసించారు. కానీ అప్పుడు ఆ మాటలు నమ్మలేకపోయాను. రాజీ పడకుండా పనిచేయాలని ఆరోజు నేర్చుకున్నానని చెప్పారు. సిరివెన్నెల సైతం తన సాహిత్యంలో రాజీ పడకుండా ఎన్నో విలువైన పాటల్ని తెలుగు ప్రేక్షకులకు అందించారని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
అంతటి గొప్ప సాహితీ వేత్త మళ్లీ పుట్టరు.. జ్ఞాపకాలను నెమరు వేసుకున్న ప్రముఖులు
అనారోగ్య సమస్యలతో ఇటీవల కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ లోకాన్ని విడిచి అకాల మరణం పొందారు. ఈ నెల 22న ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు దృవీకరించారు. ఆయన కోలుకుంటారని, మరెన్నో పాటలు తమకు అందిస్తారని ఆశించిన తెలుగు ప్రేక్షకలోకానికి సిరివెన్నెల మరణం తీరని విషాదానికి గురి చేసింది. బుదవారం మధ్యాహ్నం మహా ప్రస్థానంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications