హైదరాబాద్‌లో హవాలా నగదు కలకలం : ముగ్గురి నుంచి 70 లక్షలు స్వాధీనం
హైదరాబాద్ : ప్రలోభాల పర్వానికి తెరలేవడంతో భారీగా నగదు పట్టుబడుతోంది. మరోవైపు రూ.70 లక్షల హవాలా నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. బేగంబజార్‌లో హవాలా ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టుచేశారు.

భారీ నగదు పట్టివేత
బుధవారం సాయంత్రం ముగ్గురు హవాలా వ్యాపారులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు రూ. 70.63 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రెండు టూ వీలర్లపై ముగ్గురు వ్యక్తులు హవాలా నగదును తరలిస్తోండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. ముగ్గురిని బేగంబజార్ పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న నగదును ఐటీ అధికారులకు అందజేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.












Click it and Unblock the Notifications