Raids: సుశీ ఇన్ ఫ్రాలో జీఎస్టీ అధికారుల తనిఖీలు.. టార్గెట్ ఎవరంటే..?
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని సుశీ ఇన్ ఫ్రాలో స్టేట్ జీఎస్టీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. మూడు గంటలుగా ఈ సోదాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుశీ ఇన్ ఫ్రాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సుశీ ఇన్ ఫ్రా స్టేట్ జీఎస్టీ కింద కట్టాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు రావడంతో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
10 వేల పైచిలుకు ఓట్లు
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సమీప ప్రత్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో 10 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే మునుగోడులో గతం కంటే ఎక్కువగా బీజేపీ ఓట్లు సాధించింది. ఈడీ, ఐటీ దాడులతో కేంద్ర ప్రభుత్వం భయపెడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జీఎస్టీ అధికారులన రంగంలోకి దిచింది. కాగా సుశీ ఇన్ ఫ్రా ఎండీగా రాజగోపాల్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి కొనసాగుతున్నారు.

పోరాటం ఆగదు
మునుగోడులో ఓడిపోయినా తమదే విజయమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. కేసీఆర్ పై తన పోరాటం కొనసాగుతుందని రాజగోపాల్ రెడ్డి ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కేసీఆర్ గద్దె దింపడమే తన లక్ష్యమన్నారు.












Click it and Unblock the Notifications