Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల వేళ రేవంత్ కు చంద్రబాబు బిగ్ షాక్..!!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ కూటమికి ఈ ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. జగన్ కూటమి పైన మరోసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఏపీలో పొత్తుల ప్రభావం తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల పైన చూపుతోంది. అక్కడ కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ మద్దతు లభించింది. కానీ, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో కీలక సమరం
తెలంగాణలో జరుగుతున్ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లను గెలవాలనే ప్లాన్‌తో బీజేపీ ముందుకు పోతుంది. ఇక లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగింది. అటు బీజేపీ సొంతంగా 370 ఎంపీ సీట్లు గెలవాలనే టార్గెట్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఏపీలో జనసేన, తెలుగుదేశంతో కలిసి కూటమిగా బరిలో దిగుతోంది. ఇక తెలంగాణలో ఒంటరిగా పోటీకి దిగింది. తాజాగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ బీజేపీకి బేషరతు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది.

TDP annuounces support for BJP In Telangana Loksabha Elections as discussions with TTDP leaders

బీజేపీకి టీడీపీ మద్దతు
ఇప్పటికే బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలంగాణ టీడీపీ నేతలతో చర్చలు జరిపారు. చ‌ర్చ‌ల అనంత‌రం తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో బీజేపీకి మద్ధతు ఇవ్వాలని నిర్ణ‌యించింద‌ని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణలో బీజేపీకి మద్ధతు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి బేషజాలకు పోకుండా.. ప్రతి తెలుగుదేశం కార్యకర్త బీజేపీకి ఓటు వేసే విధంగా కృషి చేయాలని బీజేపీ సీనియ‌ర్ నేత చింత‌ల కోరారు. మన ఓటు ఇతరులకు వేస్తే నష్టం తప్ప ఇరువురికి ఎలాంటి లాభం ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా చింతల ఆకాంక్షించారు.

ఏపీలో రేవంత్ ప్రచారం
ఈనెల 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నార‌ని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు మోదీ పాల్గొనే బహిరంగ సభలో పాల్గొనాలని చింత‌ల ఆహ్వానించారు.. కాగా, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లకు పోటీ చేస్తోంది. అటు ఏపీలో కూటమిలో భాగంగా 6 సీట్లలో బరిలో ఉంది. మొత్తంగా రెండు ఉభయ రాష్ట్రాల్లో 23 స్థానాల్లో పోటీ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తరహాలోనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీడీపీ మద్దతు ఇవ్వాలని మంత్రి పొంగులేటి వంటి నేతలు నేరుగా టీడీపీ కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరారు. ఇప్పుడు టీడీపీ మద్దతు బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించటంతో ఏ మేర ప్రభావం ఉంటుందనేది రేవంత్ టీం లెక్కలు వేస్తోంది. అటు రేవంత్ టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఏపీలో ప్రచారానికి సిద్దమయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+