హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్‌పై టిఆర్ఎస్ దృష్టి: టిడిపి నుంచి పెరుగుతున్న చేరికలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇతర పార్టీ నేతలను, ప్రతినిధులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల నాయకులు, ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.

ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన స్థానిక సంస్థల నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరగా.. రంగారెడ్డి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఐటి శాఖ మంత్రి కెటి రామారావు సమక్షంలో సోమవారం టిఆర్‌ఎస్‌లో చేరారు.

కుత్బుల్లాపూర్ ఎంపిటిసిలు ఆరుగురు కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో ఐదుగురిది టిడిపి కాగా, ఒకరిది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి టిఆర్‌ఎస్ తరఫున రంగారెడ్డి జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న మాజీ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పల్లెసీమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే వారికి ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ సహకారాలు అందుతాయని స్పష్టం చేశారు.

టిఆర్ఎస్‌లో చేరికలు

టిఆర్ఎస్‌లో చేరికలు

గ్రేటర్, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇతర పార్టీ నేతలను, ప్రతినిధులను ఆకర్షిస్తోంది.

టిఆర్ఎస్‌లో చేరికలు

టిఆర్ఎస్‌లో చేరికలు

ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల నాయకులు, ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.

టిఆర్ఎస్‌లో చేరికలు

టిఆర్ఎస్‌లో చేరికలు

ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, మరోవైపు తమ పార్టీ ఓటర్లు టిఆర్‌ఎస్‌లోకి వెళ్లడం కాంగ్రెస్, టిడిపిలకు మింగుడు పడడం లేదు.

టిఆర్ఎస్‌లో చేరికలు

టిఆర్ఎస్‌లో చేరికలు

టిఆర్‌ఎస్ మాత్రం వ్యూహాత్మకంగా మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడానికి ఇతర పార్టీల స్థానిక నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది.

టిఆర్ఎస్‌లో చేరికలు

టిఆర్ఎస్‌లో చేరికలు

ఖమ్మం జిల్లాకు చెందిన స్థానిక సంస్థల నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరగా.. రంగారెడ్డి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఐటి శాఖ మంత్రి కెటిఆర్ సమక్షంలో సోమవారం టిఆర్‌ఎస్‌లో చేరారు.

టిఆర్ఎస్‌లో చేరికలు

టిఆర్ఎస్‌లో చేరికలు

కుత్బుల్లాపూర్ ఎంపిటిసిలు ఆరుగురు కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో ఐదుగురిది టిడిపి కాగా, ఒకరిది వైయస్సార్ కాంగ్రెస్.

టిఆర్ఎస్‌లో చేరికలు

టిఆర్ఎస్‌లో చేరికలు

ఈసారి టిఆర్‌ఎస్ తరఫున రంగారెడ్డి జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న మాజీ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి, శంబీపూర్ రాజు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.

టిఆర్ఎస్‌లో చేరికలు

టిఆర్ఎస్‌లో చేరికలు

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పల్లెసీమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

టిఆర్ఎస్‌లో చేరికలు

టిఆర్ఎస్‌లో చేరికలు

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే వారికి ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ సహకారాలు అందుతాయని స్పష్టం చేశారు.

English summary
Some TDP and Congress leaders are joined in TRS Party In the presence of Minister KT Rama Rao on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X