తెలంగాణాలో చంద్రబాబు వ్యూహాలు.. టీడీపీ పాదయాత్రలు, బస్సు యాత్రలు; లక్ష్యం అదే!!

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దూకుడుగా ముందుకు వెళుతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్న టిడిపి, తెలంగాణ రాష్ట్రంలోపట్టు కోసం వ్యూహాలకు పదును పెడుతుందా? తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు వేగం పెంచారా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

తెలంగాణాలో టీడీపీ పునర్వైభవం కోసం రంగంలోకి చంద్రబాబు

తెలంగాణాలో టీడీపీ పునర్వైభవం కోసం రంగంలోకి చంద్రబాబు


ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాలోనూ తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. రెండు తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణ ప్రాంతంలో టిడిపి ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్బై చెప్పి వెళ్లిపోవడంతో తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు అని భావనకు వచ్చిన సమయంలో మళ్లీ చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సభ రాజకీయ వర్గాల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటన, నిర్వహించిన సభకు ప్రజల నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో, మళ్లీ తెలంగాణలో చంద్రబాబు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి రంగంలోకి దిగారు.

ఖమ్మం సభతో టీడీపీలో జోష్ .. గడప గడపకు టీడీపీ కార్యక్రమం

ఖమ్మం సభతో టీడీపీలో జోష్ .. గడప గడపకు టీడీపీ కార్యక్రమం

ఖమ్మం జిల్లా సభ సక్సెస్ కావడంతో టీడీపీకి కంచుకోటగా భావించే పట్టు ఉన్న అనేక జిల్లాలలోనూ, రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించడానికి చంద్రబాబు సన్నద్ధమయ్యారు. అంతేకాదు బస్సు యాత్రలు, పాదయాత్రకు కూడా తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గడపగడపకు మన టిడిపి కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనూ చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ప్రతి ఇంటికి చేర్చాలని, తెలంగాణలో టిడిపి బతికే ఉందని చెప్పాలని ప్రయత్నం చేయనున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టి క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి తీసుకెళ్లనున్నారు.

తెలంగాణాలో అమీతుమీ తేల్చుకోవటానికి రెడీ అవుతున్న టీడీపీ

తెలంగాణాలో అమీతుమీ తేల్చుకోవటానికి రెడీ అవుతున్న టీడీపీ

అంతేకాదు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్రం సాధించిన ప్రగతికి సంబంధించి కరపత్రాలను ముద్రించి ప్రతి ఇంటికి అందించనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడం కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలు చేస్తున్నారు. మరో పక్కన టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కు రెడీ అయ్యారు. ఇంకో పక్కన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. ఇదే సమయంలో టిడిపి కూడా ప్రజా క్షేత్రంలో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అవుతుంది.

గ్రామస్థాయిలో పాదయాత్రలకు టీడీపీ రంగం సిద్ధం

గ్రామస్థాయిలో పాదయాత్రలకు టీడీపీ రంగం సిద్ధం

గ్రామస్థాయిలో పాదయాత్రలు చేయాలని నిర్ణయించిన టిడిపి త్వరలోనే పాదయాత్రలకు గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పని చేసే వారికి మాత్రమే వచ్చే ఎన్నికలలో టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉందని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నేతలకు తెలియజేసింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ నుండి ఇతర పార్టీలలోకి వెళ్లి, అసంతృప్తితో ఉన్న నేతలను తిరిగి సొంతగూటికి రప్పించే ప్రయత్నం చేయాలని కూడా అధినాయకత్వం ప్రయత్నిస్తుంది. ఇక తాజాగా టిడిపికి చెందిన ఒక సీనియర్ నేత ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన చాలా మంది మాజీ మంత్రులు తమతో టచ్లో ఉన్నారని చెప్పడం అందుకు ఊతమిస్తుంది. మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీలకు దీటుగా వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+