రైతాంగ పరిస్దితి ఇంత ఘోరంగా ఎప్పుడూ లేదు.!కేంద్ర, రాష్ట్రాలు వెంటనే ధాన్యం కోనాలన్న టీ టీడిపి.!
హైదరాబాద్ : ప్రస్తుతం వానాకాలం వరి పంట ధాన్యంను ప్రభుత్యం కొనుగోలు చేయకుండా యాసంగి పంటపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలంగాణ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. యాసంగి పేరు చెప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న డ్రామాలు మానుకోవాలని, రాష్ట్ర రైతాంగం వరి ధాన్యాన్ని కొనగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెల రోజులు దాటిపోతున్నా కొనుగోలు చేయటం లేదని తెలంగాణ టీడిపి అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గా ప్రసాద్ విమర్శించారు. వానా కాలం వరి ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంటామని చెప్తున్నప్పటికీ ఆచరణలో జరగటం లేదన్నారు. వరికుప్పల దగ్గర నెల రోజుల నుంచి రైతుల ప్రాణాల పోతున్నా ప్రభుత్వాలకు చలనం లేదని మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేంద్రంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎందుకు ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు.

అంతే కాకుండా ప్రధానమంత్రికి సీఎం రాసిన లేఖలో బాయిల్డ్ రైస్ ప్రస్తావనే లేదని రైతులను మభ్యపెట్టడం, మోసం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని దుర్గా ప్రసాద్ విమర్శించారు. శుక్రవారం భువనగిరి పార్లమెంట్ అధ్యక్షులు కుందరాపు క్రిష్ణామాచారీ అధ్వర్యంలో మంచాల మండల కేంద్రంలో పి ఎ సి ఎస్ నిర్వహిస్తున్న ధాన్యం కోనుగోళు కేంద్రాన్ని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు బక్కని నర్సింహులు సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. తర్వాత మంచాల మండలం నోముల గ్రామంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబూల్ బెడ్ రూమ్ ల నిర్మాణ నాణ్యతను పరిశిలించారు. ఈ కార్యక్రమాలలో జాతీయా అదికార ప్రతినిధి నన్నురి నర్సిరెడ్డి, భువనగిరి పార్లమెంట్ అద్యక్షులు కుందరాపు క్రిష్ణామాచారి, జహీరాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, రాష్ర్ట కార్యదర్శి జలమోని రవీందర్ మంచాల మండల అధ్యక్షులు చక్రపాణి, ఇబ్రహింపట్నం మండల అధ్యక్షులు జక్కా రాంరెడ్డి, తదితరులు పాల్గోన్నారు.
Recommended Video













Click it and Unblock the Notifications