టీడిపి సత్తా ఏంటో చూపిస్తాం..! పార్టీకి పూర్వవైభవం వస్తుందన్న ప్రధాన కార్యదర్శి అరవిందకుమార్ గౌడ్..
హైదరాబాద్ : నాయకులు పార్టీ మారినంత మాత్రాన పార్టీ భూస్తాపితం అయ్యే ప్రసక్తే లేదని, తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో మళ్లీ పూర్వవైభవం వస్తుందని టీడిపి ప్రధాన కార్యదర్శి అరవింద కుమార్ గౌడ్ అన్నారు. ఈనెల 26 న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో చంద్రశేఖర్ రావు ప్రభుత్వం అవలంభిస్తున్న అలసత్వ విధానాకి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ ముగిసిందని చెప్పుకొస్తున్న వారు 26వ తారీఖున ఇందిరా పార్క్ వద్దకు వస్తే టీడిపి సత్తా ఏంటో తెలుస్తుందని సవాల్ విసిరారు.
తెలుగుదేవం పార్టీ అక్షయ పాత్ర లాంటిదని, నాయకులు వెళ్లి పోతున్నా, మళ్లీ పుడుతూనే ఉంటారని చెప్పుకొచ్చారు. గాంధీనగర్ లోని సిటి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేవాదనికి ఆయన ముఖ్య అథిదిగా హాజరయ్యారు . ఈ సందర్బంగా వన్ ఇండియాతో ప్రత్యేకంగా మాట్లాడారు అరవిందకుమార్ గౌడ్. ఎంత మంది నేతలు మారినా పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని, మళ్లీ కొత్తగా నేతలు ఆవిర్బవిస్తుంటారని, అది తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని తెలిపారు.
ప్రభుత్వ అసమర్థ విధానాలను ఎండగడుతూనే పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు అరవింద కుమార్ గౌడ్. పార్టీ అధినాయకత్వంలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని, అవన్నీ సరిచూసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో టీడిపి నాయకత్వాన్ని పునర్నిర్మించేదుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ బలోపేతం, సరైన నాయకత్వం లేని చోట నాయకులను నియమించడం, అదికార పార్టీ విధానలపై పోరాటాలను రూపొందించుకోవడం, ప్రజా సమస్యల పట్ల ఉద్యమించడం వంటి అంశాలపై తెలుగుదేశం పార్టీ దృష్టి కేంద్రీకరించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ ఖాళీ ఐపోయింది అని అంటున్న వారికి త్వరలో గుణపాఠం చెబుతామని, అదికార పార్టీ విధానాలపై సరైన పోరాటం చేసే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని అరవిందకుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications