విద్యార్ధినిపై టీచర్ వెకిలి చేష్టలు: స్కూల్‌పై స్థానికుల దాడి, బస్సులకు నిప్పు

మెదక్: పిల్లలకు విద్యాబుద్దలు నేర్పాల్సిన గురువే ఓ విద్యార్ధినిపై వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో అతడు పనిచేస్తున్న ప్రైవేట్ స్కూలుకు లక్షల నష్టాన్ని తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే... మెదక్‌ జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేట గ్రామంలో చోటు చేసుకుంది.

ఆరేళ్ల బాలికపై స్కూలు పీఈటీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం చిత్తాపూర్‌ గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి అక్బర్‌పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. అదే గ్రామానికి చెంది పీఈటీగా విధులను నిర్వహిస్తున్న కుమార్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

రెండు రోజుల క్రితం బాలికను ఓ తరగతి గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలికను సోమవారం స్కూలుకు వెళ్లేందుకు భయపడింది. అంతేకాదు తాను వేరే స్కూల్లో చేరతానని బాలిక చెప్పడంతో అసలేం జరిగిందంటూ తల్లిదండ్రులు బాలికను నిలదీశారు.

 Teacher arrested for harassing minor girls at School in Medak

దీంతో బాలిక స్కూల్లో ఇబ్బందిగా ఉందంటూ స్కూలుకి వెళ్లనంటూ పీఈటీ కుమార్ తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. అంతేకాదు రెండు రోజులు క్రితం బాలికపై కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సమయంలో బాలిక రోదనలు విన్న తోటి విద్యార్ధులు ప్రిన్సిపాల్ రమేశ్‌కు తెలియజేశారు.

అయితే దీనిని ప్రిన్సిపాల్ తేలికగా కొట్టిపారేశారు. సోమవారం ఉదయం బాలిక అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె బంధువులు ఆగ్రహావేశంతో పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యపు సమాధానం వారిని మరింత ఆగ్రాహావేశాలకు గురి చేసింది.

వికాస్ హైస్కూల్‌‌పై మూకుమ్మడిగా విధ్వంసం సృష్టించారు. ప్రిన్సిపాల్‌పై దాడి చేయడంతో పాటు స్కూల్లో కనిపించిన కుమార్‌పై కూడా దాడి చేశారు. ఈ క్రమంలో పాఠశాల ఆవరణలో నిలిపి ఉంచిన రెండు బస్సులకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రెండు బస్సులు కూడా మంటల్లో తగలబడిపోయాయి.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనఫై సమాచారం అందుకున్న పోలీసులు పీఈటీ కుమార్‌ను అదుపులోకి తీసుకుని సిద్ధిపేట జీఎంసీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+