వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు గోస వర్ణనాతీతం.!కల్లాలు చూస్తే కన్నీళ్లే.!కల్లాల్లో కాంగ్రెస్ కార్యక్రమంలో వేదన పడ్డ రేవంత్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఎన్నో హృదయ విదారక సంఘటనలు చవిచూడాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూసి చలించిపోయినట్టు పేర్కొన్నారు. పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో పంటపోలాల వద్దకు వెళ్లిన నాయకులకు రైతుల దయనీయ స్ధితి కన్నీళ్లు పెట్టించిందని ఆవేదన వ్యక్తం చేసారు. దేశానికి వెన్నెముక లాంటి రైతన్న పరిస్థితి క్షేత్ర స్దాయిలో ఇంత దారుణంగా ఉంటుందా అని కాంగ్రెస్ నేతలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దగా మాటలకు రైతు పూర్తిగా రోడ్డు పాలయ్యాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

 కల్లాల్లో కాంగ్రెస్ కార్యక్రమం.. రైతుల పరిస్థితి అల్లకల్లోలంగా ఉందన్న రేవంత్ రెడ్డి..

కల్లాల్లో కాంగ్రెస్ కార్యక్రమం.. రైతుల పరిస్థితి అల్లకల్లోలంగా ఉందన్న రేవంత్ రెడ్డి..

ఇదిలా ఉండగా కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో కల్లాలలో కాంగ్రెస్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం రుణ మాఫి చేయక పోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, నిండు అసెంబ్లీ లో రైతుల సమస్యలని పరిష్కారిస్తామని చేప్పి రైతులను చంద్రశేఖర్ రావు మోసం చేసిండని, రాష్ట్రంలో సీఎం కేంద్రంలో పీఎం చీకటి ఒప్పందం చేసుకోని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు పార్లమెంటు సమావేశంల్లో రైతుల సమస్యల గురించి విన్నవిస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.

 రైతులను మోదీ, కేసీఆర్ నిండా ముంచారు.. తెలంగాణ ప్రభుత్వం వరి కొనాలన్న పీసిసి ఛీఫ్

రైతులను మోదీ, కేసీఆర్ నిండా ముంచారు.. తెలంగాణ ప్రభుత్వం వరి కొనాలన్న పీసిసి ఛీఫ్

అంతే కాకుండా రైతుల జోలికి వచ్చినోల్లు ఎవ్వరూ బాగుపడలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. వర్షా కాలంలో తెలంగాణ రైతులు పండించిన వరి పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొంత మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మండల పరిధిలోని ఎదులాబాద్ లో ఉన్న రైతు సమన్వయ కేంద్రాన్ని రేవంత్ బృందం సందర్శించింది.

 రైతులను రోడ్డుకీడ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్న రేవంత్

రైతులను రోడ్డుకీడ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్న రేవంత్

కేంద్రాలలో నిల్వ ఉన్న వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని లేని పక్షంలో మంత్రి మల్లారెడ్డి ఇంటి ముట్టడి చేపడతామని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేసారు. శుక్రవారం మేడ్చల్ జిల్లాలో రైతు కేంద్రంలో రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్య వివరించారు టీపిసిసి నాయకులు. అంతే కాకుండా గడువు లోపు వరి ధాన్యం కొనుగోలు చేయకుంటే మంత్రి ఇళ్ళు ముట్టడిస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

Recommended Video

Farms Laws వెనక్కి తీసుకోవడం KCR విజయం! - TRS నేతలు || Oneindia Telugu
 పార్లమెంట్ లో రైతు సమస్యలను ప్రస్తావిస్తా.. రైతులకు రేవంత్ రెడ్డి భరోసా..

పార్లమెంట్ లో రైతు సమస్యలను ప్రస్తావిస్తా.. రైతులకు రేవంత్ రెడ్డి భరోసా..

ఇదిలా ఉండగా కామారెడ్డి జిల్లా నల్లమడుగు గ్రామంలో ఇటీవల పాము కాటుకు గురై మరణించిన రైతు మెట్టు ప్రభాకర్ కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా మెట్టు ప్రభాకర్ కుటుంబానికి టీపీసీసీ తరపున రేవంత్ రెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఆయిలపూర్ గ్రామానికి చెందిన బీరయ్య ఇటీవల కామారెడ్డి మార్కెట్ లో ధాన్యం కుప్ప మీదనే మృతి చెందిన విషయం తెలిసిందే. బీరయ్య కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.

English summary
Congress leaders are amazed that the situation of the peasantry as the backbone of the country is so bad at the field level. Revanth Reddy was indignant that the farmer had completely lost his way due to the lies being told by the Telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X