టెక్కీ మధుకర్ రెడ్డి: అమ్మా క్షమించు అంటూ తల్లికి మేసేజ్
అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మధుకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నాడు.అయితే ఆత్మహత్య చేసుకొనేముందు అమ్మా క్షమించు అంటూ ఆయన మేసేజ్ పెట్టాడు.
భువనగిరి: అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మధుకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నాడు.అయితే ఆత్మహత్య చేసుకొనేముందు అమ్మా క్షమించు అంటూ ఆయన మేసేజ్ పెట్టాడు.మధుకర్ రెడ్డి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
అమెరికాలో నివసిస్తున్న టెక్కీలు అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.లేదా అమెరికాలో చోటుచేసుకొంటున్న జాత్యంకార దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శశికళ, ఆమె కొడుకు అనీష్ హత్యకు గురయ్యారు. అంతకుముందు శ్రీనివాస్ కూచిబొట్ల హత్యకు గురయ్యారు.ఈ ఘటనలు మరిచిపోకముందే మధుకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మధుకర్ రెడ్డి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.ఈ విషయం తెలియగానే కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు

ఆత్మహత్యకు ముందే తల్లికి మేసేజ్
మధుకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొనేముందు తన తల్లికి మేసేజ్ పెట్టాడు. మమ్మీ క్షమించు అంటూ ఆయన తల్లికి మేసేజ్ పెట్టాడు.మంగళవారం ఉదయం ఆయన మరణించినట్టుగా మధుకర్ రెడ్డి కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది.అయితే ఈ మేసేజ్ ను అమెరికా కాలమానం ప్రకారం పెట్టాడు.అయితే ఈ మేసేజ్ తల్లికి రాత్రి పూట వచ్చింది.

14 ఏళ్ళ క్రితమే అమెరికాకు మధుకర్ రెడ్డి
యాదగిరిగుట్ట మండలం రాళ్ళ జనగాం గ్రామానికి చెందిన గూడురు బాల్ రెడ్డి, సుగుణ దంపతుల కొడుకు మధుకర్ రెడ్డి. చదువు కోసం మధుకర్ రెడ్డి 14 ఏళ్ళ క్రితమే అమెరికాకు వెళ్ళాడు.ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్ళి అక్కడే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకొంటూ ఉండిపోయాడు. ఏడేళ్ళ క్రితం భువనగిరికి వచ్చి స్వాతిని వివాహం చేసుకొన్నాడు. ప్రస్తుతం వారికి నాలుగేళ్ళ కూతురు ఉంది.మధుకర్ రెడ్డి కాలిఫోర్నియాలో ఉంటున్నాడు.

వారం రోజుల క్రితమే తండ్రికి ఫోన్
అమెరికాలోని కాలిఫోర్నియాలో మధుకర్ రెడ్డి స్వంత ఇల్లును కొనుగోలు చేశాడు. ఈ విషయమై ఆయన తండ్రి బాల్ రెడ్డితో మధుకర్ రెడ్డి మాట్లాడాడు. ఇల్లుకు కొంత డబ్బులను బాల్ రెడ్డి మధుకర్ కు పంపాడు.అయితే తన కుమారుడికి ఆర్థిక సమస్యలు లేవని బాల్ రెడ్డి చెబుతున్నాడు. తన కొడుకు రెండుసార్లు క్షమించమంటూ మేసేజ్ పెట్టాడని ఆ మేసేజ్ ను తెల్లారి చూసుకొన్నామని బాల్ రెడ్డి చెప్పాడు.

కుటుంబ కలహలేనా?
భువనగిరి మండలం మద్దెలగూడెనికి చెందిన స్వాతిని మధుకర్ రెడ్డి వివాహం చేసుకొన్నాడు.అయితే మధుకర్ రెడ్డి కాలిఫోర్నియా వెళ్ళిన తర్వాత వీరిద్దరి మద్య సాఫీగానే జీవితం సాగింది.అయితే ఇటీవల కాలంలో దంపతుల మధ్య కలహలు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతున్నారు.ఈ కలహలు ఆత్మహత్య చేసుకొనే పెద్దవి కావంటున్నారు.












Click it and Unblock the Notifications