కేంద్రంపై కేసీఆర్ యుద్ధం.. ఈనెల 20న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
కేంద్రం ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమైయ్యారు. తెలంగాణ భవనలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానంపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిలదీస్తూ ఈనెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు గులాబీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.

కేంద్రంపై యుద్ధం..
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. రైతులను అదుకోవడంతో మోదీ సర్కారు విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్రం చేతులెత్తేసిందని మండిపడ్డారు. అడుగడుగునా అన్నదాతలను దగా చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన విసృత స్థాయి సమావేశం జరిగింది.

రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
ఈసమావేశంలో ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లు, బొగ్గు గనుల ప్రైవేటీకరణ , రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరుపై చర్చించారు. కేంద్రంపై పోరు సాగించాలని నిర్ణయించారు. అనుసరించాల్సి భవిష్యత్ కారాచరణపై చర్చించారు. ఈసందర్భంగా కేంద్రం తీరును ఆయన ఎండగట్టారు. మోదీ ప్రభుత్వ విధానాలతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రేపు ఢిల్లీకి మంత్రుల బృందం వెళ్లి కేంద్రమంత్రిని కలవనున్నారని తెలిపారు. మరోసారి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని చెప్పాలని డిమాండ్ చేయనున్నారని కేసీఆర్ వెల్లడించారు.

ఈనెల 20 రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఈనెల 20న తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాని గులాబీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు. నిరసనలో భాగంగా కేంద్రంతో పాటు బీజేపీ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలన్నారు. కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు, విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించాలని పార్టీ నేతలు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పకొట్టండి.
రాష్ట్రప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. దళితబంధు, రైతుబంధుపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుబంధు పథకం ఎప్పటిలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. విపక్షాల మాయ మాటలు ప్రజలు నమ్మోద్దని కొరారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు.

5. పార్టీలో కష్టపడ్డవారికే పదవులు
పార్టీలో కష్టపడి పనిచేసేవారికే పదవు ఇస్తామని గులాబీ శ్రేణులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో ఉండాలని వారి సమస్యలు తెలుసుకుని పనిచేయాలని సూచించారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోనేలా రైతుల్లో చైతన్యం తీసుకురావాలని పార్టీ నేతలకు సూచించారు.. మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications