కేసీఆర్ అవినీతిని వెలికి తీయండి.. టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ .. తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు అమిత్ షా క‌ర్త‌వ్య‌బోధ‌న‌

తెలంగాణలో మరింత దూకుడుగా పెంచాలని రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో టీఆర్ఎస్ చేసే ఆరోపణలకు ధీటుగా తిప్పికొట్టాలన్నారు. సీఎం కేసీఆర్ అవితీతికి వెలికితీసి ప్రజల ముందుకు పెట్టాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల మధ్య ఉండే కార్యక్రమాలు చేపాట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా క‌ర్త‌వ్య‌బోధ‌న చేశారు.

 టీఆర్ఎస్ నేత‌ల‌కు ధీటైన జ‌వాబు

టీఆర్ఎస్ నేత‌ల‌కు ధీటైన జ‌వాబు

ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగువేయోద్దని తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్ధేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఆందోళనలకు అదే రీతిలో సమధానం ఇవ్వాలని సూచించారు. ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సమావేశమైయ్యారు. ఈ భేటీకి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్ , బీజేపీ రాష్ట్ర అధ్యఉడు బండి సంజయ్ , మాజీ మంత్రులు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ అర్వింద్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు ఇతర నేతల హాజరయ్యారు. ఈసమావేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ధాన్యం కొనుగోలు , కేసీఆర్ వ్యవహార తీరుపై చర్చించారు.

కేసీఆర్ అవినీతిని వెలికితీయాలి..

కేసీఆర్ అవినీతిని వెలికితీయాలి..

ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ చేసే ఆరోపణలను తిప్పికొట్టాలని ఈ భేటీలో రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా సూచించారు. టీఆర్ఎస్ నేతల బియ్యం కుంభకోణం, అవినీతిని వెలికితీయాలని కర్తవ్యబోధన చేశారు. సీఎం కేసీఆర్ అవినీతిని ప్రజలకు వివరించాలని సూచించారు. వారు చేసే కుంబ‌కోణాలపై విచారణకు డిమాండ్ చేశాలని రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాలి..


వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనం ముందుకు వెళ్లానని అమిత్ షా సూచించారు. ప్రజలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరించేలా పోరాటం చేయాలి. నిత్యం ప్రజల మధ్య ఉండే కార్యక్రమాలు ఉండేలా ప్రణాళికలు చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ వ్యవహారాలకు పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ భేటీలో ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్ ను అమిత్ షా అభినందించారు. త్వరలోనే తాను తెలంగాణలో పర్యటిస్తానని పార్టీ నేతలకు తెలిపారు.

 రా రైస్ ఎంతైనా కొంటాం

రా రైస్ ఎంతైనా కొంటాం

కేంద్రంపై కేసీఆర్ ప్రభుత్వ తప్పుడు ఆరోపణలు చేస్తుందని వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణ రైతాంగాన్ని టీఆర్ఎస్ నేతలు గందర‌గోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ధాన్యం సేకరణను పెంచామని తెలిపారు. ఖరీప్ ఎంత రా రైస్ ఇచ్చినా తీసుకునేందుకు సిద్ధమని గోయల్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+