TS Tenth Result 2023: నేడే తెలంగాణ పదో తరగతి ఫలితాలు..

నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 99.63 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

పదో తరగతి పరీక్షలకు మొత్తం 4,84,620 మంది హాజరయ్యారు. ఇక ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఫలితాల ప్రాసెసింగ్ కూడా ఇటీవలే ముగిసింది. ఇప్పటికే ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణ ఫలితాల విడుదల కోసం విద్యార్దులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలను bse.telangana.gov.in లేదా bseresults.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

tenth-results

మంగళవారం ఇంటర్ ఫలితాలు విడదలైన సంగతి తెలిసిందే.. మరో వైపు నేటి నుంచి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. 12,13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు ఆన్ లైన్ నిర్వహిస్తుండడం వల్ల 5 రోజులు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+