తెలంగాణలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా కేసులివే: బ్రిటన్ వైరస్‌‌తో బెంబేలు

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. కొత్త కేసులు 500లకు కాస్త అటుఇటుగా నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా పరిమితంగా ఉంటున్నాయి. మరణాల సంఖ్య అయిదుకు దాటట్లేదు. యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేలకు దిగువగా నమోదు అయ్యాయి. కొత్త కేసుల నమోదులో వేగం మందగించింది. అదే సమయంలో బ్రిటన్ నుంచి స్వస్థలానికిక చేరుకున్న వారిలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది. కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్‌ వ్యాప్తి చెందుతుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 472 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మరణించారు. 509 మంది డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,84,863కి చేరుకుంది. ఇందులో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 2,76,753 మంది ఉన్నారు. 1,531 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు ఏడు వేలకు దిగువగా నమోదు అయ్యాయి. తాజా బులెటిన్ ప్రకారం.. 6,579 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.

Telangana: 472 Covid19 positive cases and and 2 deaths reported in last 24 hours

గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 4,426 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కొత్తగా 106 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకటి రోజువారీ కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువ. జిల్లాలవారీగా ఆదిలాబాద్-7, భద్రాద్రి కొత్తగూడెం-15, జగిత్యాల-8, జనగామ-2, జయశంకర్ భూపాలపల్లి-7, జోగుళాంబ గద్వాల-6, కామారెడ్డి-6, కరీంనగర్-17, ఖమ్మం-16, కొమరంభీమ్ ఆసిఫాబాద్-2, మహబూబ్‌నగర్-6, మహబూబాబాద్-12, మంచిర్యాల-19, మెదక్-7, మేడ్చల్ మల్కాజ్‌గిరి-45, ములుగు-7, నాగర్ కర్నూల్-6, నల్లగొండ-23, నారాయణ్‌పేట్-1, నిర్మల్-3, నిజామాబాద్-10, పెద్దపల్లి-10, రాజన్న సిరిసిల్ల-8, రంగారెడ్డి-44, సంగారెడ్డి-8, సిద్ధిపేట్-17, సూర్యాపేట్-9, వికారాబాాద్-3, వనపర్తి-4, వరంగల్ రూరల్-7, వరంగల్ అర్బన్-18, యాదాద్రి భువనగిరి-13 కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 37,347 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 67,23,710గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1,80,647 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+