ఏపీకి 2 టీఎంసీలు ఇచ్చేందుకు తెలంగాణ ఓకే.. ఏపీ, తెలంగాణ ఈఎన్సీలతో బోర్డు సెక్రటరీ భేటీ
తెలుగురాష్ట్రాల మధ్య జలజగడానికి ఫుల్ స్టాప్ పడినట్టే అనిపిస్తోంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 203తో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా కృష్ణా, గోదావరి నదులపై అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా.. కృష్ణా, గోదావరి బోర్డులకు ఫిర్యాదు చేసింది.

తాగునీటి కోసం..
తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు కృష్ణా రివర్ బోర్డు సెక్రటరీ పరమేశం శుక్రవారం ఏపీ, తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో సమావేశమయ్యారు. చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని.. ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై డిస్కస్ చేశామని తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధరరావు పేర్కొన్నారు. తాగునీటి కోసం నీరివ్వాలని ఏపీ కోరగా.. సానుకూలంగా స్పందించినట్టు మురళీధరరావు తెలిపారు. ఆ నీరు తాగునీటి అవసరాలకేనని చెప్పడంతో తెలంగాణ అభ్యంతరం తెలుపులేదు.

తమ వాటా నీటినే..
తమ వాటా నుంచి 2 టీఎంసీల నీటిని తీసుకెళ్తున్నట్టు ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మీడియాకు తెలిపారు. సాగర్ కుడికాల్వ నుంచి నీరు తీసుకెళ్లేందుకు తెలంగాణ అంగీకరించిందని ఆయన తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం ఈ నీటిని వినియోగిస్తారని చెప్పారు. సాగర్, శ్రీశైలం నుంచి తమకు రావాల్సిన నీటి కేటాయింపులను వాడుకుంటామని తెలియజేశారు. తాగునీటి అవసరాల కోసం అని చెప్పడంతో.. తెలంగాణ కూడా అంగీకరించింది. దీంతో ఫిర్యాదుల పర్వంపై కృష్ణా బోర్డు విచారణ కాంప్రమైజ్ అయిందని చెప్పాలి.
Recommended Video

ప్రాజెక్టులపై చర్చలు..
కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కృష్ణా, గోదావరి బోర్డులు విచారించాల్సి ఉంది. తాగునీటి కోసం 2 టీఎంసీలు ఇచ్చినందున.. తెలంగాణ ప్రాజెక్టులపై కూడా ఏపీ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో తెలుగురాష్ట్రాల మధ్య జలవివాదం సమసిపోయిందని చెప్పొచ్చు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications