వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ టర్మ్‌లో ఇదే చివరిది- తెలంగాణ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలకు ముహూర్తం కుదిరింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి- ఈ బడ్జెట్ భేటీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. దీనికి అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తోంది. దీనిపై ఈ మధ్యాహ్నమే ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాత్రికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం తేదీలు ఖరారయ్యాయి.

టీడీపీ డ్యామేజ్ కంట్రోల్- అయ్యన్నపై చర్యలు తీసుకోక తప్పదా..?!టీడీపీ డ్యామేజ్ కంట్రోల్- అయ్యన్నపై చర్యలు తీసుకోక తప్పదా..?!

ఫిబ్రవరి 3 నుంచి..

ఫిబ్రవరి 3 నుంచి..

ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మ‌ధ్యాహ్నం 12:10 నిమిషాలకు స‌భ స‌మావేశమౌతుంది. ఈ మేరకు శాసన సభ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావు- తొలిరోజే బ‌డ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్ర‌వేశ‌పెట్టనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణాభివృద్ధి.. వంటి కీలక రంగాలపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది.

రూ.3 లక్షల కోట్లు..

రూ.3 లక్షల కోట్లు..

2023-24 సంవత్సరానికి కేసీఆర్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనలు 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారు కావడానికి ముందే కేసీఆర్ ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. హ‌రీష్ రావుతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

 ప్రతిష్ఠాత్మకం..

ప్రతిష్ఠాత్మకం..

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తెలంగాణ. ఆగస్టు-సెప్టెంబర్ లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ప్రతిపాదనలను అధికార భారత్ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ టర్మ్ లో ఇదే చివరి బడ్జెట్ కావడం రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యతలు ఎలా ఉండబోతోన్నాయనేది ఆసక్తి రేపుతోంది. అందరి దృష్టీ దీని మీదే నిలిచింది.

 జాతీయ స్థాయిలో..

జాతీయ స్థాయిలో..

కేసీఆర్- గత ఏడాదే పూర్తిస్థాయి జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారు. టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా ఆవిర్భవించింది. అటు ఏపీలోనూ బీఆర్ఎస్ కార్యకలాపాలు విస్తృతమౌతోన్నాయి. అటు ఖమ్మంలోనూ కేసీఆర్- భారీ బహిరంగ సభను నిర్వహించారు. జాతీయ స్థాయి నాయకులను రప్పించారు. వారి సమక్షంలో తన సత్తా చాటారు. ఈ పరిణామాల మధ్య ఇక ఈ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా ఉండబోతాయనేది చర్చనీయాంశమౌతోంది.

English summary
Telangana Assembly Budget sessions all set to kick start from February 3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X