వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలస్యం నిమిషమే..! బట్ నామినేషన్ కు నో ఛాన్స్.. మొత్తం 3,584 దాఖలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 22 వరకు సమయం | Oneindia Telugu

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. చివరిరోజైన సోమవారం ఒక్కనాడే 2,087 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. వీటితో కలుపుకొని మొత్తం 3,584 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాఖలైన నామినేషన్లను పరిశీలించి మంగళవారం నాడు అర్హులైనవారి నామినేషన్లు ఆమోదించనున్నారు రిటర్నింగ్ అధికారులు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో తప్పులు గానీ, లోపాలు గానీ ఉంటే అధికారులు రిజెక్ట్ చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 22 వరకు సమయముంది.

చివరిరోజు సోమవారం దాఖలైన 2,087 నామినేషన్ల వివరాలు :
టీఆర్ఎస్ - 116
కాంగ్రెస్ - 135
బీజేపీ - 128
బీఎస్పీ - 112
టీడీపీ - 20
సీపీఎం - 28
సీపీఐ - 3
ఏఐఎంఐఎం - 13
ఎన్సీపీ - 21
ఇండిపెండెంట్లు మరియు ఇతరులు - 1511

ఛత్తీస్ గఢ్ లో తుది పోరు.. 72 స్థానాలకు 1101 అభ్యర్థులు.. విజయంపై పార్టీల ధీమాఛత్తీస్ గఢ్ లో తుది పోరు.. 72 స్థానాలకు 1101 అభ్యర్థులు.. విజయంపై పార్టీల ధీమా

telangana assembly elctions nominations

చివరిరోజు ఇటు టీఆర్ఎస్ నేతలు ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, కేటీఆర్.. అటు కాంగ్రెస్ లీడర్లు జానారెడ్డి, భట్టి విక్రమార్క, డీకే అరుణ, రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య తదితరులు నామినేషన్లు సమర్పించారు.

నామినేషన్ల పర్వంలో కూడా నిమిషం లేట్ నిబంధన కొందరికి నిరాశ కలిగించింది. పరీక్షలకు నిమిషం ఆలస్యమయితే అనుమతించకూడదనే రూల్ ఉంది. అలాగే నామినేషన్ల విషయంలో కూడా నిమిషం లేట్ ఎఫెక్ట్ తప్పలేదు. ముషీరాబాద్ నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన విన్‌స్టెన్‌ కు చేదు అనుభవం ఎదురైంది. నిమిషం ఆలస్యంగా రావడంతో నామినేషన్ వేయడానికి అధికారులు అనుమతించలేదు. దీంతో ఆయన నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు.

English summary
telangana assembley elections nomination time is over. total 3,584 nominations received by elections officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X