Telangana Assembly election 2023: తెలంగాణలో ముగిసిన పోలింగ్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు. దీంతో సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా యువత ఓటింగ్‌కు పెద్ద ఎత్తున తరలివస్తోంది. అదే సమయంలో తొలిసారి ఓటు హక్కు కలిగి ఓటు వేస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్ల వద్ద కనిపిస్తున్నారు. ఇక ప్రధాన పోటీ అధికారిక బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే పోరు ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది.

Telangana Assembly election 2023 Live updates in telugu:Polling for 119 constituencies

ప్రతిపక్షాలు అధికార పార్టీ వైఫల్యాల గురించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా... అధికార పార్టీ తాము సాధించిన విజయాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. ఇక 119 అసెంబ్లీ స్థానాల్లో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగుతుంది. చివరి నిమిషంలో క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అనుమతిస్తోంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

Nov 30, 2023, 5:22 pm IST

కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.
Nov 30, 2023, 4:57 pm IST

తెలంగాణలో ముగిసిన పోలింగ్
Nov 30, 2023, 4:45 pm IST

కాసేపట్లో ముగియనున్న పోలింగ్.
Nov 30, 2023, 4:34 pm IST

రండి ఓటు వేయండి.. కొద్ది సమయమే ఉందని ఓటర్లను అబ్యర్థిస్తున్న ఎన్నికల సంఘం.
Nov 30, 2023, 4:28 pm IST

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు ఆది దంపతులు.
Nov 30, 2023, 4:20 pm IST

హైదరాబాద్ లో మందకొడిగా సాగుతోన్న పోలింగ్.
Nov 30, 2023, 4:09 pm IST

సిద్దిపేటలో స్వామి (54)అనే వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకుని తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో గుండెపోటుకు గురయ్యాడు.
Nov 30, 2023, 4:04 pm IST

సిర్పూర్‌, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.
Nov 30, 2023, 4:00 pm IST

తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించారు.
Nov 30, 2023, 3:51 pm IST

మిర్యాలగూడలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య స్వల్పంగా ఘర్షణ చోటుచేసుకుంది.
Nov 30, 2023, 3:43 pm IST

మధ్యాహ్నం 3గంటలకు పోలింగ్‌.. 51.89 శాతం.
Nov 30, 2023, 3:36 pm IST

జూబ్లీ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మహేశ్‌బాబు.
Nov 30, 2023, 3:24 pm IST

పోలింగ్ కు గంటన్నరే టైమ్ ఉంది. రండి ఓటు వేయండి అని అధికారులు కోరుతున్నారు.
Nov 30, 2023, 3:22 pm IST

ఎమ్మెల్యే రమేశ్‌కు ఒంటిమామిడిపల్లి గ్రామస్థుల నుంచి నిరసన ఎదురైంది. పోలింగ్‌ పరిశీలనకు వెళ్లిన ఆరూరి రమేష్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు.
Nov 30, 2023, 3:16 pm IST

హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి ఎన్‌బీటీ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఓటేశారు.
Nov 30, 2023, 3:05 pm IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్తుండగా ఆయనను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
Nov 30, 2023, 3:00 pm IST

రాజేంద్రనగర్‌లో పోలీసులు లాఠీఛార్జి చేశారు. కాంగ్రెస్‌, భారాస నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Nov 30, 2023, 2:54 pm IST

ఈసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి లేఖ రాశారు. బీఆర్ఎస్ నేతలు కోడ్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపణ.
Nov 30, 2023, 2:48 pm IST

హైదరాబాద్ లో ఖాళీగా దర్శనమిస్తున్న పోలింగ్ కేంద్రాలు
Nov 30, 2023, 2:44 pm IST

ఈటల రాజేందర్ కమలాపూర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Nov 30, 2023, 2:39 pm IST

కొడంగల్‌ నియోజకవర్గం రేగడి మైలారం వద్ద కాంగ్రెస్‌, భారాస వర్గాల మధ్య ఘర్షణ.
Nov 30, 2023, 2:35 pm IST

ఓటు హక్కు వినియోగించుకున్న బ్రహ్మానందం
Nov 30, 2023, 2:25 pm IST

నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డిపై కేసు నమోదు.
Nov 30, 2023, 2:03 pm IST

హస్తం సునామీ దెబ్బకు కారు గ్యారేజ్ కి వెళ్లబోతోందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
Nov 30, 2023, 1:57 pm IST

ఆదిలాబాద్ పట్టణంలో ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై చనిపోయారు.
Nov 30, 2023, 1:56 pm IST

మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్ గా 36.68 శాతం పోలింగ్ నమోదు.
Nov 30, 2023, 1:53 pm IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఓటు వేసిన అనంతరం పోలింగ్ బూత్ బయట ప్రచారం చేయడంతో కవితపై ఫిర్యాదు అందినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. దీనిపై డీఈవోకు ఆదేశాలిచ్చామని ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు అయిందని వివరించారు.
Nov 30, 2023, 1:48 pm IST

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటులు జగపతిబాబు, రామ్‌, విష్వక్‌సేన్‌.
Nov 30, 2023, 1:44 pm IST

ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు నరేష్‌, గాయని కౌశల్య.
Nov 30, 2023, 1:39 pm IST

ఇళ్ల నుంచి బయటకు వచ్చి అందరూ ఓటు వేయాలని కోరిని విజయ్ దేవరకొండ.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+