కవిత ఎమోషనల్: తండ్రిపై: బీఆర్ఎస్ ఓటమి తప్పదంటూ ఎగ్జిట్ పోల్స్ తేల్చేసిన వేళ..!!

Kalvakuntla Kavitha: తెలంగాణలో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. అధికార భారత్ రాష్ట్ర సమితికి నిరుత్సాహాన్ని కలిగించాయి. ఓటమి తప్పదనే సంకేతాలను పంపించాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి బీఆర్ఎస్ పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లాయి.

గురువారం తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన విషయం తెలిసిందే. ఒకట్రెండు ఎగ్జిట్ పోల్స్ హంగ్ వైపు మొగ్గు చూపాయి. అంతే గానీ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తీరుతుందంటూ ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా స్పష్టం చేయలేదు.

Telangana Assembly elections results 2023: BRS leader Kavitha emotional tweet

ఒకట్రెండు మినహా దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. హస్తం పార్టీకి భారీ మెజారిటీని అందించాయి. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను ఎంత వరకు నిజం అవుతాయనేది ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నానికి స్పష్టం కానుంది.

ఈ పరిణామాలతో బీఆర్ఎస్‌ కిందిస్థాయి నాయకులు కూడా గెలుపుపై పెద్దగా ఆశలు పెట్టుకోవట్లేదని చెబుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సహా జిల్లా ఆఫీసుల్లోనూ సంబరాలు, ఉత్సాహభరిత వాతావరణం కనిపించట్లేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని, తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. ఓ ఎమోషనల్ ట్వీట్‌ను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కేసీఆర్‌ను హీరోగా అభివర్ణించారు. మై హీరో.. అంటూ కీర్తిస్తూ కేసీఆర్ ఉన్న ఓ చిన్న వీడియో క్లిప్‌ను షేర్ చేశారామె.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+