Telangana election Polling: మరికొద్ది గంటల్లో తెలంగాణలో పోలింగ్, సర్వం సిద్ధం, ఓటర్ల తీర్పు ఈవీఎం పెట్టెల్లోకి

తెలంగాణ వ్యాప్తంగా గురువారంనాడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తైంది. డీఆర్‌సీ(DRC) కేంద్రాలకు చేరుకున్న పోలింగ్‌ సిబ్బంది.. ఈవీఎంలు, ఇతర సామగ్రిని అందజేశారు. పోలింగ్‌ సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. ఓటర్లు తమ తీర్పును ఈవీఎం పెట్టెల్లో నిక్షిప్తం చేయనున్నారు.

సమస్యాత్మక ప్రాంతాలు మినహా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రంలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఇక, సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1.85 లక్షల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. 27,094 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ ప్రక్రియ
పరిశీలనకు 22 వేల మంది అబ్జర్వర్లు, స్క్వాడ్లను నియమించారు. ఇక, హైదరాబాద్ నగరంలోని యూసుఫ్‌ గూడ, గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన డీఆర్‌సీ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌ రోస్‌ పరిశీలించారు.

telangana assembly elections today; all set for polling

తెలంగాణ ఓటర్లకు కీలక సమాచారం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో మహిళా అభ్యర్థులు 221 మంది ఉన్నారు. పురుషులు 2068 మంది, ఒక ట్రాన్స్‌జెండర్ పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,62,98,418 మంది, మహిళా ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2944 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్ ఓటర్లు సంఖ్య 2676, రాష్ట్రంలో సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2944 మంది ఓటర్లున్నారు. ఇక, 9,99,667 మంది ఓటర్లు 18-19 ఏళ్ల వయస్సువారున్నారు.

కాగా, నవంబర్ 30న సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఓట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 21,686 వీల్ చైర్లు సిద్ధం చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ఏర్పాటు చేశారు.

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 120 పోలింగ్ కేంద్రాలను నిర్వహించనున్నారు దివ్యాంగులు. 597 పోలింగ్ కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. పోలింగ్ ప్రక్రియలో 1,85,000 మంది సిబ్బంది, 22,000 మంది మైక్రో అబ్జర్వర్లు పనిచేస్తున్నారు.

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగితా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలను, రాష్ట్ర ప్రభుత్వం 50 వేల మంది పోలీసులను కేటాయించింది. నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3 ఫలితాలు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+