నేడే తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశాలు: ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం రేవంత్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ మూడవ శాసనసభ సమావేశాలు శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ‌తో రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించనున్న అక్బరుద్దీన్ ఒవైసీ.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ నియామకంపై రాజ్ భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణ రాష్టం ఆవిర్భావం తర్వాత నవంబర్ 30న మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 119 స్థానాల్లో 65 స్థానాలతో స్పష్టమైన మెజారిటీ సాధించింది కాంగ్రెస్. దీంతో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మారిపోయింది. బీఆర్ఎస్‌ కేవలం 39 స్థానాలతో సరిపెట్టుకుంది.

Telangana assembly session will begin today

కాగా, గురువారం తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్‌రెడ్డి, 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అదేరోజు తొలి కేబినెట్ సమావేశం కూడా నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రమాణస్వీకారం చేయించేందుకు శుక్రవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్‌ 118 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

అయితే, అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే తాను ప్రమాణం చేయనని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్ల నున్నారు. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశం కానున్నారు. అనంతరమే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని తెలుస్తోంది.

కాగా, స్పీకర్‌గా ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ స్పీకర్ ​ఎన్నిక కోసం నోటిఫికేషన్ ​జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 10వ తేదీ లేదా 11వ తేదీన స్పీకర్ ​ఎన్నిక జరిగే అవకాశం ఉంది. స్పీకర్‌‌‌‌గా వికారాబాద్​ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌ను కాంగ్రెస్ అధిష్ఠానం​ ఇప్పటికే ప్రకటించింది.

ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం రేవంత్ రెడ్డి

మరోవైపు, శుక్రవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడిపారు. మొదట మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న రేవంత్.. ఆ పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ సమావేశమయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయ్యారు రేవంత్. తెలంగాణలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖల కేటాయింపు అంశంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. నేడు అసెంబ్లీ సమావేశాలున్న క్రమంలో తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+