తన వద్దకు వచ్చిన రేవంత్ కు కేసీఆర్ ఏం చెప్పారు- ఆ వెంటనే, కీలక నిర్ణయం...!!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. కాగా, సభలో కేసీఆర్ కూర్చొన్న సీటు వద్దకు వచ్చి సీఎం రేవంత్ సడన్ షాక్ ఇచ్చారు. కేసీఆర్ కు కరచాలనం చేసారు. ఆరోగ్యం పై ఆరా తీసారు. ఈ సన్నివేశాన్ని సభతో పాటుగా అందరూ ఆసక్తిగా గమనించారు. కాగా.. ఆ తరువాత జరిగిన బీఏసీ సమావేశంలో సమావేశాల నిర్వహణ పైన కీలక నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీ ఈ రోజు ఉదయం ప్రారంభ సమయానికే మాజీ సీఎం కేసీఆర్ సమావేశాలకు వచ్చారు. కాగా, సభలో కేసీఆర్ కూర్చొన్న సీటు వద్దకు పార్టీ ముఖ్యులతో వచ్చిన సీఎం కేసీఆర్ కరచాలనం చేసారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీసారు. కేసీఆర్ స్పందిస్తూ... నైస్... గుడ్ లక్ చెప్పారు. సీఎం నేరుగా కేసీఆర్ వద్దకు వచ్చిన సమయంలో బీఆర్ఎస్ నేతలు లేచి గౌరవంగా నిలబడ్డారు. కేసీఆర్ ఆ తరువాత సభ నుంచి వెళ్లిపోయారు.

అదే విధంగా కేసీఆర్ ను తాను కలవటం పైన రేవంత్ స్పందించారు. కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్న సమయంలోనూ తాను కలిసిన విషయాన్ని గుర్తు చేసారు.శాసనసభ మొదలైన వెంటనే మాజీ ఎమ్మెల్యే ఆర్ దామోదర రెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మృతికి శాసనసభ సంతాపం తెలియజేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతాప తీర్మానాలను సభలో చదివి వినిపించారు. మాజీ ఎమ్మెల్యేల ఆత్మకు శాంతి చేకూరాంటూ సభలో సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఆ తరువాత శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ(బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలపై బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనవరి 2 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా.. ఈ సమావేశాల్లో సాగునీళ్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ క్రమంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు తదితర అంశాలపై సభలో కూడా చర్చ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని వివరాలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై సభలో ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇక.. సంతాప తీర్మానాల వరకు ఉండకుండా వెళ్లిపోవటం పైన కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసారు.












Click it and Unblock the Notifications