డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా రెవెన్యూ సవరణల్లో కీలకమైన ఆర్వోఆర్ చట్టాన్ని ఆమోదించనున్నారు. దీని ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టొచ్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.

అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనపై చర్చించి ఆమోదించనున్నారు. దీని ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో రైతు భరోసా, ఆసరా పింఛన్ల పెంపుపైనా అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉంది.

Telangana Assembly sessions from December 9

ఇది ఇలావుండగా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ 7వ తేదీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతుంది. ఆలోపే కేబినెట్ విస్తరణ జరుగుతుందని సమాచారం.

ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రపతికి వీడ్కోలు

రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ముర్ము రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ధనసరి అనసూయ (సీతక్)క స్వాగతం పలికారు. నగర మేయర్ విజయలక్ష్మి గద్వాల, ప్రభుత్వ సలహాదారు (ప్రొటొకాల్) హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలకు చెందిన అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+