Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్!!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు కొనసాగుతున్నాయి. ఈరోజు ఆరో రోజు శాసనసభ సమావేశాలలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు శాసనసభ్యులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కాగా సభ్యులకు కీలక సందేశం ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

నిన్న 17 గంటలపాటు నడిచిన శాసనసభ
ఇంతకు ఆయన ఏమన్నారంటే.. నిన్న తెలంగాణ శాసనసభ ఉదయం 10 గంటలకు ప్రారంభమై నేడు తెల్లవారుజామున మూడు గంటల 15 నిమిషాలకు ముగిసింది. దాదాపు 17 గంటల పాటు తెలంగాణ శాసనసభ కొనసాగింది. నిన్న తెలంగాణ శాసనసభలో మొత్తం 19 పద్దుల పైన చర్చ జరిగింది. 19 శాఖలకు చెందిన పద్దుల పైన చర్చించి శాసనసభ వాటికి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.

Telangana assembly Speaker gave shock to the MLAs along with CM Revanth Reddy

సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దన్న స్పీకర్
అయితే ఒకే రోజు 17 గంటల పాటు శాసనసభ సమావేశం జరగటం రికార్డ్ బ్రేక్ కాగా, స్పీకర్ కాస్త ఇబ్బంది పడ్డట్టు తాజాగా ఆయన వ్యాఖ్యలతో అర్ధం అయ్యింది. సభ్యులు సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని స్పీకర్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఎవరికి కేటాయించిన అంశంపై వారే నిర్దేశిత సమయంలోగా మాట్లాడాలని సభ్యులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు.

నేడు 19 శాఖలపైన చర్చ
ఈరోజు కూడా శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలుకాగా నేడు శాసనసభలో స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. నేడు జరగనున్న శాసనసభ సమావేశంలో ముఖ్యంగా 19 శాఖలలో ఉన్న సమస్యల పైన చర్చించనున్నారు. దేవాదాయ, అటవీ శాఖల సమస్యల పైన, మత్స్యశాఖ, క్రీడలు యువజన సర్వీసులు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమంపైన నేడు శాసనసభలో చర్చ జరుగుతుంది.

నిర్దేశించిన సమయంలోనే మాట్లాడాలన్న స్పీకర్
సాగునీరు, పౌరసరఫరాల సమస్యల పైన కూడా చర్చించనున్నారు. వ్యవసాయ శాఖ, పర్యాటక శాఖలలో ఉన్న సమస్యల పైన కూడా శాసనసభలో చర్చ జరగనుంది. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మాతా శిశు సంక్షేమం పైన సభలో శాసనసభ్యులు చర్చ జరపనున్నారు. అయితే నిన్న శాసనసభ 17 గంటల పాటు నడిచిన క్రమంలో నేడు సభ్యులు నిర్దేశించిన సమయంలోనే మాట్లాడాలని స్పీకర్ సూచించడం సీఎం రేవంత్ రెడ్డి తో పాటు శాసనసభ్యులందరికీ షాక్ అనే చెప్పాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+