తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు: అక్టోబర్ 27 నుంచి..
ఈ నెల 27నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు.. 15 నుంచి 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణం తీసుకుంది. ఈ నెల 27నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు.. 15 నుంచి 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు సంబంధించి 26న బీఏసీ సమావేశంలో షెడ్యూల్ ఖరారు కానుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ దీనిపై మాట్లాడారు. అసెంబ్లీలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చ జరగాలన్నారు. ప్రతిపక్షాలు ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

సభలో ప్రతిపక్షాలు ఏ అంశంపై ప్రశ్న లేవనెత్తినా.. జవాబు చెప్పేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. సభ హుందాగా నడవాలని, ప్రతి అంశంపై చర్చ జరగాలని సీఎం పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications