Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు.. గుంజుకొచ్చి జైల్లో వేస్తాం.. కేసీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పుడైనా జెలుకు వెళ్లోచ్చని అన్నారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రం చర్యలు ప్రారంభించిందని పేర్కొన్నారు. జైలుకు పంపుతుందన్న భయంతోనే ముందస్తుగా సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నా గుంజుకొచ్చి జైల్లో వేయడం పక్కా అని వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్.

Recommended Video

    TRS And BJP Deal - Revanth Reddy Allegations | Telangana Congress | Oneindia Telugu
    కేసీఆర్ ఎప్పుడైనా జెలుకు వెళ్లొచ్చు

    కేసీఆర్ ఎప్పుడైనా జెలుకు వెళ్లొచ్చు

    రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుని.. దాచుకుంటుందని ఆరోపించారు బండి సంజయ్. స్వామి వేవేకానంద జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ కార్డియాక్ మెడికల్ క్యాంప్ ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌పై విచుకుప‌డ్డారు.

    కేసీఆర్ అవినీతి ఒక్కొక్కటి బయటకు తీస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గానే ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైందని పేర్కొన్నారు. ఆయన ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చని వ్యాఖ్యానించారు. ఈ విషయం కేసీఆర్ తెలిసే కొత్త డ్రామాలకు తెరతీశారని బండి సంజయ్ విమర్శించారు. ఎన్నిక డ్రామాలు వేసినా వదిపెట్టేది లేదని హెచ్చరించారు.

    ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు

    ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు

    థర్డ్ ప్రంట్ పేరుతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. జైలు వెళ్లొచ్చని విషయం కేసీఆర్‌కు తెలిసిపోయింది కాబట్టే కమ్యూనిస్టులతో పాటు ఇతర విపక్ష పార్టీల నేత‌లతో వరుసగా భేటీ అవుతున్నారు. సానుభూతి పొందేందుకే ఈ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు. అంతా బోగస్ కేసీఆర్‌కు తెలిసిందల్లా దోచుకోవడం.. దాచుకోవడమే అని మండిపడ్డారు. కేసీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా జైలుకు పంపించుడు పక్కా అంటూ బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.

    జైలుకు వెళ్తే ఎలా ఉంటుందో ..

    జైలుకు వెళ్తే ఎలా ఉంటుందో ..

    ఫామ్ హౌస్‌లో ఉండే సీఎం కేసీఆర్.. దేశ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తారని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను పట్టించుకోని కేసీఆర్ .. దేశంలో జనాలకు ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పసుగ్రాసం కుంభకోణం కేసులో ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లి వచ్చారు. సీఎం కేసీఆర్ కూడా జైలుకు వెళ్తారు. అందుకే జైలుకు వెళ్తే ఎలా ఉంటుందో తేజస్వి యాదవ్ కేసీఆర్‌కు వివరించి ఉంటారని బండి సంజ‌య్ సెటైర్లు వేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+