నన్ను డమ్మీ అన్నవాళ్లకు డాడీ అవుతా.. తెలంగాణ బీజేపీ చీఫ్ వార్నింగ్!
Telangana BJP Chief Ramchander Rao: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది కిరీటం కాదని.. అదొక బాధ్యత అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి సారించామని.. వీలైనన్నీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రాజాసింగ్ అంశాన్ని జాతీయ అధినాయకత్వమే చూసుకుంటుందని రాంచందర్ రావు తెలిపారు. తాను డమ్మీ లీడర్‌నా.. కాదా? అనేది త్వరలో చూపిస్తానని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తనను డమ్మీ అన్నవాళ్లకు డాడీ అవుతా అంటూ ఆయన హెచ్చరించారు. మొత్తం తెలంగాణలో తన కంటే ఫైర్ బ్రాండ్ ఎవరూ లేరని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. తన పొలిటికల్ లైఫ్‌లో ఇప్పటివరకు 14 సార్లు జైలుకు వెళ్లి వచ్చానని.. లాఠీ దెబ్బలు తిన్నానని.. మావోయిస్టులతో పోరాటం చేశానని ఆయన గుర్తు చేశారు. అందరినీ కలుపుకుపోవాలనే ఉద్దేశంతో కూల్‌గా ఉంటున్నానని.. తన ఉగ్రరూపం చూస్తే తట్టుకోలేరని ఘాటుగా వ్యాఖ్యానించారు.

చొక్కా గుండీలు విప్పి అడ్డగోలుగా బూతులు మాట్లాడితే మాస్ లీడర్ కాదని.. సిద్ధాంతాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లగలిగిన వారే అసలైన నాయకులని అన్నారు. ఆ నమ్మకం, సంకల్పం తనకు ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ పార్టీలో ఎలాంటి విభేధాలు లేవని.. అందరం కలిసికట్టుగానే పని చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ పార్టీ అని.. దానితో ఎవరికీ ఉపయోగం లేదని విమర్శించారు. తమ పోటీ ఎప్పుడూ కాంగ్రెస్‌తోనే ఉంటుందని రాంచందర్ రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications