భారత్‌కు ప్ర‌ధానిగా ఎందుకు? ఉక్రెయిన్‌కు అధ్యక్షుడు అవండి : కేసీఆర్‌పై తరుణ్ చుగ్ సెటైర్లు

తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇప్పటి నుంచే పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టిపెట్టాయి. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వ్యహకర్త ప్రశాంత్ కిషోర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దింపారు. ఆ మేరకు ఇరువురు ప్రత్యేకంగా సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. మరోసారి అధికారమే లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ ను కేసీఆర్ రెడీ చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్‌ను కేసీఆర్ తన ఎన్నికల వ్యూహకర్తగా తెచ్చుకోవడంపై అటు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

 ఫ్రంట్ పేరుతో పొలిటికల్ టూరిజం

ఫ్రంట్ పేరుతో పొలిటికల్ టూరిజం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని కావాలని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్. కుల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌న్నారు. వాటి నుంచి బయటపడేందుకే కేసీఆర్‌ రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. థర్డ్ ఫ్రంట్ పేరుతో పొలిటికల్ టూరిజం చేస్తున్నారని సెటైర్లు విసిరారు. ఆయన పర్యటనలు కేవలం పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్తున్నట్లే ఉన్నాయి తప్ప వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తురుణ చుగ్ చురకలు అంటించారు.

 కేసీఆర్ ఉక్రెయిన్ అధ్య‌క్షుడు అవ్వొచ్చు

కేసీఆర్ ఉక్రెయిన్ అధ్య‌క్షుడు అవ్వొచ్చు


కేసీఆర్ ఇండియాకు ప్ర‌ధానిగా ఎందుకు. రష్యా , ఉక్రెయిన్‌లకు అధ్య‌క్షుడు అవ్వొచ్చని తరుణ్ చుగ్ సైటెర్లు వేశారు. త్వరలోనే ఉక్రెయిన్ అధ్యక్ష పదవి ఖాళీ అవుతుంది . కావాలంటే ఆ దేశానికి అధ్యక్షుడుగా కూడా చేయోచ్చంటూ చురకలు అంటించారు. ఎంతమంది ప్రశాంత్ కిషోర్‌లు వచ్చినా కేసీఆర్‌ను కాపాడలేరని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని విమర్శించారు. కేసీఆర్ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కుటుంబ పాలన చేసేవారికి వ్యూహకర్తలు అవసరం ఉంటుందని విమర్శించారు.

టీఆర్ఎస్‌లో ఓట‌మి భ‌యం

టీఆర్ఎస్‌లో ఓట‌మి భ‌యం


తమకు ఎలాంటి ప్రశాంత్ కిషోర్‌లు అవసరం లేదని తరుణ్ చుగ్ టీఆర్ఎస్ పార్టీ నేతలను హెచ్చరించారు. బీజేపీ బూత్ స్థాయి కార్యకర్త ఒక్కరు పీకేతో సమానమని మండిపడ్డారు. కేసీఆర్ తన అవినీతిని దాచిపెట్టేందకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల యుద్ధం కేసీఆర్, బీజేపీ మధ్యకాదన్నారు. తెలంగాణ‌ను ర‌క్షించుకునేందుకు అని స్ప‌ష్టం చేశారు. ఓటమి భయంతోనే ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+