రేవంత్ రెడ్డి! నీలా నేను చేయలేను: టీపీసీసీ చీఫ్‌పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని చురకలంటించారు. ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం తన వల్ల కాదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎలా నడుపుతున్నారో.. జానారెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందన్నారు బండి సంజయ్.
తమ దగ్గర సీనియర్లు బాస్‌లు.. అదే కాంగ్రెస్‌లో హోంగార్డులు అంటూ బండి సంజయ్.. రేవంత్ రెడ్డికి చురకలంటించారు. హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామన్నారు. పార్టీ నడపరాకుంటే ఎలా గెలుస్తామన్నారు. తా గెలుపు పరంపరం కొనసాగిస్తున్నామని.. కాంగ్రెస్ వారు ఓటమి పరంపర సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. డిపాజిట్లు కోల్పోయిన పరంపర వారిలో సాగుతోంది. ముసుగులు వేసుకుని తిరిగే పార్టీ తమది కాదన్నారు బండి సంజయ్.

ఓవైసీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనలేదని... దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు బండి సంజయ్. ఎంఐఎం పార్టీని నిజమైన తెలంగాణ ముస్లింలు వ్యతిరేకించాలని బండి సంజయ్ కోరారు. తెలంగాణ ఆవిర్భావంలో జెండా ఎగురవేయనోడికి తెలంగాణలో పోటీ చేసే అర్హత లేదన్నారు. దమ్ముంటే దారుస్సలాంకు తాళం వేయాలని.. ఆర్నెళ్లలో తాము అధికారంలోకి వచ్చాక దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు ఆ స్థలంను పంచిపెడుతామన్నారు బండి సంజయ్.
17 సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించామని బండి సంజయ్ తెలతిపారు. తెలంగాణ ఆవిర్భవాన్ని కూడా అధికారికంగా నిర్వహించామన్నారు. ఈ క్రెడిట్ మొత్తం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో తెలంగాణ అవిర్భావ వేడుకులు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎగరవేసిన సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. ప్రజలు అంతో ఇంతో సంతోషంగా ఉన్నారంటే అది కేంద్ర నిధులతోనేని చెప్పారు. రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన కొనసాగుతుందన్న సంజయ్ .. రైతుల అత్మహత్యల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని అన్నారు.
నలుగురి కోసం తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బండి సంజయ్ వెల్లడించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని స్పష్టం చేశారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications