ఏపీ ప్రజలకు దత్తన్న శుభాకాంక్షలు, సంతోషంగా ఉందన్న కిషన్ రెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అభినందనలు తెలిపారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఆయన గురువారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి వెలుగొందాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో రాజధాని అమరావతి అన్నివిధాలుగా ముందు ఉంటుందని దత్తాత్రేయ ఆకాంక్షించారు.

రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం అన్నివిధాల సాయం అందిస్తుందని ఆయన తెలిపారు. అమరావతి శరవేశంగా అభివృద్ధి చెందాలని అన్నారు. చారిత్రాత్మక నిర్మాణా కార్యక్రమంలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.

చంద్రబాబు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి జరుగుతుంది: కిషన్ రెడ్డి

Telangana Bjp president Kishan Reddy on AP Capital Amaravati

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని, అందుకు కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

నవ్యాంధ్ర నూతన రాజధాన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమరావతి సభా ప్రాంగణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు.

సూర్యాపేట నుంచి ఆయన నేరుగా హెలికాఫ్టర్‌లో బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, ఈటెల, జగదీశ్‌రెడ్డిలు ఉన్నారు. మధ్యాహ్నం రెండుగంటల వరకు ఆయన అక్కడ గడపనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+