తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త ఎయిర్ పోర్టులు.. ఈ జిల్లాల్లోనే..!
తెలంగాణ లో ఎయిర్ పోర్టు అంటే అందరికీ రాష్ట్ర రాజధానిలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గుర్తొస్తుంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కావడంతో సకల సదుపాయాలు ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే అనేక దేశాలకు ఇక్కడి నుంచి విమానాలు ఉంటాయి. ప్రపంచ దేశాల విమానాలు ఇక్కడ ల్యాండ్ అవుతుంటాయి. అయితే ఇలాంటి ఎయిర్ పోర్టులను రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని నిర్మించేందుకు ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.
మొదటి ప్రాధాన్యం వరంగల్ లోని మామునూరుకు ఉంది. ఆ తర్వాత రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ లకూ పచ్చజెండా ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాజాగా మరో రెండు జిల్లాల్లో ఎయిర్ పోర్టులను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. కొత్తగా నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. రానున్న రెండు మూడేళ్లలో వీటిని పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్ అని తెలిసిన విషయమే.. అయితే వరంగల్ లోని మామునూరులో నిజాం కాలం నుంచే విమానాలు నడిచేవి. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు విమానాశ్రయం మూతపడింది. అయితే దీనికి సంబంధించి అక్కడ 696 ఎకరాల భూమి ఉంది. అయితే దీనికి మరో 250 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేటాయించింది. ఈ మేరకు చిన్న విమానాల రాకపోకలకు ఈ ఎయిర్ పోర్టును తీర్చిదిద్దనున్నారు. దీంతోపాటు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

అయితే తాజాగా నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ జిల్లాల్లోనూ ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులను కూడా ప్రాధాన్యత జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications