తెలంగాణ బడ్జెట్ 2022: మార్చి 15 వరకు బడ్జెట్ సమావేశాలు; బీఏసీ సమావేశంలో నిర్ణయం
తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మంత్రి హరీష్ రావు 2022- 23 సంవత్సరానికిగానూ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2,56,958. 51 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయన కేంద్రంలోని బీజేపీ తీరుపై ఫైర్ అయ్యారు.
Recommended Video
రెండు గంటల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ రంగానికి, విద్య, వైద్యం తో పాటు, రాష్ట్రంలోని వివిధ పథకాల కోసం చేసిన కేటాయింపులను మంత్రి హరీష్ రావు చదివి వినిపించారు. సోమవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా మధ్యాహ్నం 1:30 నిమిషాలకు హరీష్ రావు తన ప్రసంగాన్ని ముగించారు.ఆ తర్వాత శాసన సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఆపై తెలంగాణ శాసనసభ వ్యవహారాల సలహా సంఘం బీఏసీ భేటీ అయింది.

శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈనెల 15వ తేదీ వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో 7 రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి అని తెలుస్తుంది. మార్చి 9వ తేదీన బుధవారం నాడు బడ్జెట్ పై సాధారణ చర్చ చేపట్టనున్నారు. 10, 11, 12, 14 తేదీలలో పద్దుల పై చర్చించనున్నారు. 15వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్నారు.
8వ తేదీ, 13వ తేదీ శాసన సభకు సెలవులుగా ప్రకటించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు హాజరయ్యారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications